Moviesబాల‌య్య‌కు విజ‌య‌శాంతి ద్రోహం చేస్తే... సిమ్రాన్ చిరంజీవికి దెబ్బేసింది... !

బాల‌య్య‌కు విజ‌య‌శాంతి ద్రోహం చేస్తే… సిమ్రాన్ చిరంజీవికి దెబ్బేసింది… !

తెలుగు తెరకు సంక్రాంతికి అవినాభావ సంబంధం ఉంది. గత ఐదు దశాబ్దాలకు పైగా సంక్రాంతికి తెలుగులో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యి.. తెలుగు ప్రేక్షకులను అలరించడం జరుగుతూ వస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకేసారి సంక్రాంతి సినిమాలు రిలీజ్ చేస్తే అది అభిమానులకు అసలు సిసలు పండగే అవుతుంది. ఇక ఇద్దరు సీనియర్ హీరోలు చిరంజీవి – బాలకృష్ణ దాదాపు మూడున్న‌ర‌ దశాబ్దాలకు పైగా తమ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.

 

ఇక వచ్చే సంక్రాంతికి కూడా బాలయ్య వీరసింహారెడ్డి – చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నారు. అయితే ఇప్పుడు ఇద్దరు హీరోల సంక్రాంతి సినిమాల మధ్య హీరోయిన్ సెంటిమెంట్ ఇంట్రెస్టింగ్ విషయం అయ్యింది. చిరంజీవి – బాలయ్య సంక్రాంతికి చాలా సార్లు పోటీ పడ్డారు. అయితే గతంలో రెండు సార్లు వీరు సంక్రాంతికి పోటీ పడినప్పుడు వీరి సినిమాల్లో హీరోయిన్ కూడా ఒక్కరే ఉన్నారు. 1988లో చిరంజీవి మంచిదొంగ – బాలయ్య ఇన్స్పెక్టర్ ప్రతాప్ సంక్రాంతికి వచ్చాయి.

ఈ రెండు సినిమాలలోను విజయశాంతి హీరోయిన్. అప్పుడు చిరంజీవి మంచిదొంగ సినిమాపై చేయి సాధించింది. అలా విజయశాంతి బాలయ్యకు కలిసి రాలేదు. మామూలుగా బాలయ్య – విజయశాంతి కాంబినేషన్ కు ఒక క్రేజీ ఉంటుంది. కానీ చిరంజీవితో సంక్రాంతికి పోటీపడినప్పుడు మాత్రం బాలయ్య విజయశాంతికి హిట్ ఇవ్వలేకపోయింది. ఇక 2001 సంక్రాంతి కానుకగా ఏకంగా చిరంజీవి – బాలయ్య – వెంకటేష్ ముగ్గురు తమ సినిమాలతో పోటీపడి బాక్సాఫీస్ ను వేడెక్కించారు.

అయితే చిరంజీవి మృగరాజు – బాలయ్య నరసింహనాయుడు సినిమాలలో సిమ్రాన్ హీరోయిన్. అయితే ఈ పోటీలో మాత్రం బాలయ్య బ్లాక్ బ‌స్టర్ రికార్డుతో విజయం సాధించారు. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి వీరిద్దరూ కలిసి ఒకే హీరోయిన్‌తో త‌మ సంక్రాంతి సినిమాల‌తో పోటీ ప‌డుతున్నారు. వీరసింహా రెడ్డి – వాల్తేరు వీరయ్య సినిమాల‌లో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది.

 

గ‌తంలో విజ‌య‌శాంతి చిరంజీవికి క‌లిసి వ‌స్తే, సిమ్రాన్ చిరంజీవికి పీడ‌క‌ల మిగిల్చి బాల‌య్య‌కు మాంచి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చింది. మ‌రి ఇప్పుడు శృతీహాస‌న్ చిరు, బాల‌య్య‌ల‌లో ఎవ‌రికి చేదు, ఎవ‌రికి తీపి పంచుతుందో ? సంక్రాంతికి తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news