Moviesమొదట చరణ్- ఆ తరువాత బన్నీ..ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజీ నా బాసూ..!!

మొదట చరణ్- ఆ తరువాత బన్నీ..ఇదేమన్నా ఫ్యామిలీ ప్యాకేజీ నా బాసూ..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ తో హిట్ కొట్టిన తర్వాత ..మళ్లీ ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయాలి అంటే కొంచెం టైం తీసుకుంటారు . ఒకే కాంబో లో ఒకే కాంబినేషన్ తెరపై చూడడానికి జనాలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించారు. అయితే ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ ప్యాకేజి తీసుకుంటున్న విధంగా స్టార్ డైరెక్టర్.. స్టార్ కుటుంబాలు వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయలేకపోతున్నారు .

మనకు తెలిసిందే.. గతంలో సుకుమార్- బన్నీతో కలిసి సినిమాల్య్ చేశాడు. మళ్ళీ తర్వాత బన్నీతో కలిసే పుష్ప సినిమా చేసాడు..ఇప్పుడు పుషప 2 కూడా తీస్తున్నాడు . ఇక అదే విధంగా తారక్ తో రాజమౌళి ఎన్ని సినిమాలు తీశాడో మనకు తెలిసిందే. ఫ్యూచర్లో మళ్ళీ తారక్ తో సినిమా తీస్తానని కూడా చెప్పుకొచ్చాడు రాజమౌళి . ప్రజెంట్ శంకర్ డైరెక్షన్లో చరణ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా అయిపోగానే శంకర్ మరో మెగా హీరోతో సినిమా చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తుంది . ఆ మెగా హీరో ఎవరో కాదు అల్లు అర్జున్. పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ తో సినిమా తీయ్యడానికి శంకర్ బ్యాక్ గ్రౌండ్లో స్కెచ్ వేస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట . ఈ న్యూస్ బయటకు రావడంతో కొందరు నెటిజన్స్ శంకర్ ని ఆడేసుకుంటున్నారు. ఇది ఏమన్నా ఫ్యామిలీ ప్యాకేజీ నా.. ఒక హీరో అయిపోగానే మరో హీరో కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయండి అంటూ చెప్పుకొస్తున్నారు . చూడాలి మరి శంకర్ బావ – బామ్మర్దులకు ఎలాంటి హిట్ అందిస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news