Moviesబిగ్ షాకింగ్ ట్వీస్ట్.. ఇక పై బిగ్ బాస్ "స్టార్ మా"లో...

బిగ్ షాకింగ్ ట్వీస్ట్.. ఇక పై బిగ్ బాస్ “స్టార్ మా”లో రాదు.. వేరే ఛానల్ లో ప్రసారం..?

తెలుగు జనాలకు ఎంతో ఇష్టమైన బిగ్బాస్ సీజన్ సెవెన్ స్టార్ మా లో ప్రసారం కాదు అన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే విదేశాలలో బిగ్ బ్రదర్ అనే పేరుతో ప్రారంభమైన ఈ రియాల్టి షోను బిగ్బాస్ పేరుతో ఇండియాలోనూ ప్రసారం చేస్తున్నారు . అంతేకాదు అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ షో మంచి ఆదరణ లభించుకోవడం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం.

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే ఒక పెద్ద రియాల్టీ షో గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఇప్పటికే ఆరు సీజన్లు.. ఒక ఓటిటి కంప్లీట్ చేసుకుని ..బిగ్ బాస్ సీజన్ సెవెన్ మరో ఛానల్లో టెలికాస్ట్ కాబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎంటీమోల్ షైన్ స్టార్ మాతో ఉన్న ఆరు సంవత్సరాల అగ్రిమెంట్ పూర్తయిన కారణంగా ఇకనుంచి ఏడవ సీజన్ స్టార్ మా లో ప్రసారం కాదు అంటూ తెలుస్తుంది .

ఈ క్రమంలోనే అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత కొత్త అగ్రిమెంట్ కోసం చర్చలు జరుపుతున్నారట . ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే ఎంటీమోల్ షైన్ జీ తెలుగులో బిగ్బాస్ షో టెలికాస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఈసారి సరికొత్త రూల్స్ తో కొత్త కంటెంట్తో బిగ్ బాస్ సీజన్ సెవెన్ తీర్చిదిద్దబోతున్నారట . మరీ ముఖ్యంగా సామాన్య ప్రజలకు యూట్యూబ్ స్టార్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా అమౌంట్ కూడా ఎక్కువ పెంచే విధంగా బిగ్ బాస్ మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తున్నరట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news