Moviesఆ హీరోయిన్‌తో నీ ఎఫైర్ నిజ‌మేనా... బాల‌య్య ప్ర‌శ్న‌తో ప్ర‌భాస్ ఫేస్‌లో...

ఆ హీరోయిన్‌తో నీ ఎఫైర్ నిజ‌మేనా… బాల‌య్య ప్ర‌శ్న‌తో ప్ర‌భాస్ ఫేస్‌లో షాకింగ్ మార్పు (వీడియో)

న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహాలో అన్‌స్టాప‌బుల్ షో స్ట్రీమింగ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది ముగిసిన అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 1 బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఇక ఈ యేడాది ప్రారంభ‌మైన సీజ‌న్ 2 కూడా సూప‌ర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే ఐదు ఎపిసోడ్లు కూడా స్ట్రీమింగ్ అవ్వ‌గా తొలి ఎపిసోడ్ చంద్ర‌బాబు – లోకేష్‌ది సినిమా, రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ప్ర‌కంప‌న‌లు రేపింది.

ఇక యంగ్ హీరోల‌తో బాలయ్య 2, 3 ఎపిసోడ్ల‌లో చేసిన అల్ల‌రి మామూలుగా పేల‌లేదు. ఇక ఐదో ఎపిసోడ్లో ఇద్ద‌రు అగ్ర నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, సురేష్‌బాబు, ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్లు కె. రాఘ‌వేంద్ర‌రావు, కోదండ రామిరెడ్డితో బాల‌య్య అదిరిపోయే ర‌చ్చ చేశారు. ఈ ఎపిసోడ్ బాగా పేల‌డంతో పాటు మంచి వ్యూస్ కూడా వ‌చ్చాయి. ఇక ఇప్పుడు ఈ సీజ‌న్లో 6వ ఎపిసోడ్‌పై అప్పుడే భారీ అంచ‌నాలు స్టార్ట్ అయ్యాయి.

యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఈ షోకు రావ‌డం ఈ సీజ‌న్‌కే హైలెట్ కానుంది. ఈ షో గ్లింప్స్ టీజ‌ర్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ షోలో ప్ర‌భాస్‌తో పాటు మ‌రో హీరో గోపీచంద్ కూడా వ‌చ్చాడు. ఈ గ్లింప్స్ టీజ‌ర్లో బాల‌య్య ప్ర‌భాస్‌ను ఆహ్వానించ‌డం, వాటేసుకోవ‌డంతో పాటు బాల‌య్య కావాల్సినంత ఎంట‌ర్టైనింగ్‌గా షోను న‌డిపించ‌డంతో పాటు ప్ర‌భాస్ – గోపీచంద్ స్నేహం గురించి కూడా ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు వేశాడ‌ట‌.

ఈ షోలో అనుష్క‌తో నీ ఎఫైర్ ఎంత వ‌ర‌కు వ‌చ్చింద‌న్న ప్ర‌శ్న కూడా బాల‌య్య వేశాడ‌ట‌. ఈ ప్ర‌శ్న బాల‌య్య నోటి నుంచి వ‌చ్చిన వెంట‌నే ప్ర‌భాస్ ఫేస్ ఒక్కసారిగా మారిపోవ‌డంతో పాటు మీడియా మా ఇద్ద‌రికి ఎన్నిసార్లు అయినా పెళ్లి చేసుకుంటుంద‌ని ఫ‌న్నీగానే ఆన్స‌ర్ ఇచ్చాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ షో ప్రోమో కూడా రిలీజ్ కానుంది. ఈ ప్రోమోగోల‌నే ఆ హీరోయిన్‌తో నీ ఎఫైర్ ఎక్క‌డి వ‌ర‌కు అన్న ప్ర‌శ్న‌ను క‌ట్ చేసి ఎపిసోడ్‌పై హైప్ మ‌రింత పెంచేలా ప్లాన్ చేస్తున్నార‌ట ఆహా మేక‌ర్స్‌.

ఇక న్యూ ఇయ‌ర్ కానుక‌గా డిసెంబ‌ర్ 31న ఈ ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి న్యూ ఇయ‌ర్ కానుక‌గా తెలుగు ప్ర‌జ‌ల‌కు కావాల్సినంత ఎంట‌ర్టైన్‌మెంట్ బాల‌య్య‌, ప్ర‌భాస్‌, గోపీచంద్ ఇవ్వ‌నున్నారు. ఈ ఎపిసోడ్ ఆహా చ‌రిత్ర‌లోనే స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేయ‌నుంద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news