Moviesబన్నీ కి అనుపమ చెల్లెల్లు నా..కొంప ముంచేసావు గా అరవిందో..!!

బన్నీ కి అనుపమ చెల్లెల్లు నా..కొంప ముంచేసావు గా అరవిందో..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట ఇండస్ట్రీలో పలు రకాల రోల్స్ లో మెప్పించిన అల్లు అరవింద్ ..ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చాడు . ఇక తనదైన స్టైల్ లో ప్రొడ్యూస్ చేస్తూ స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నాడు. కాగా ఏదైనా ఆ ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడితే అక్కడ అంతా ఫుల్ జోష్ వచ్చేస్తుంది. సందడి వాతావరణం గా మారిపోతుంది.

 

తనదైన స్టైల్ లో స్పీచ్ ఇస్తూ సరదాగా నవ్విస్తూ నలుగురు నవ్వుకునేలా మాట్లాడడం అల్లు అరవింద్ స్పెషాలిటీ . కాగా ఈ క్రమంలోనే రీసెంట్గా “18 పేజెస్” సినిమా నుంచి ఓ సాంగ్ ని రిలీజ్ చేసిన క్రమంలో అల్లు అరవింద్ ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . నిఖిల్ సిద్ధార్ధ్- అనుపమ పరమేశ్వరన్ కలిసి జంటగా నటిస్తున్న మరో చిత్రం 18 పేజీస్. ఇదివరకే వీళ్ళు కార్తికేయ 2 సినిమాల్లో జత కట్టి బ్లాక్ బస్టర్ పెయిర్ గా టాక్ సంపాదించుకున్నారు.

కాగా ఇదే క్రమంలో 18 పేజీస్ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు జనాభా. ఈ సినిమాను జిఏ 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు . ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తుండగా .. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. కాగా ఈ సినిమా నుండి “ఏడు రంగుల వాన” అంటూ కలర్ ఫుల్ పాటను రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోని ఈ ఈవెంట్లో మాట్లాడుతూ అనుపమ పరమేశ్వరణ్ గురించి ఓ రేంజ్ లో పొగిడేసారు అల్లు అరవింద్.

“నాకు ఎందుకో మొదటి నుంచి అనుపమను చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది . ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది . ఆమెకు నటించడం రాదు మనసులో ఏది ఉంటే అదే ముఖంలో కనిపిస్తుంది . అలాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలో రేర్ గా ఉంటారు . నాకు అనుపమను చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఇలాంటి కూతురు నాకుంటే బాగుండేది అని . ఇలాంటి హీరోయిన్స్ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు . అందుకే నాకు అనుపమంటే చాలా ఇష్టం అంటూ చెప్పకు వచ్చారు .

అల్లు అరవింద్ ఎటువంటి కల్మషం లేకుండా ఈ కామెంట్స్ చేసిన సోషల్ మీడియాలో మాత్రం కొందరు ట్రోలర్స్ కావాలని అల్లు అరవింద్ ని ట్రోల్ చేస్తున్నారు . అనుపమ నీ కూతురైతే బన్నీకి చెల్లెలా ..అయ్య బాబోయ్ అనుపమ లాంటి కత్తి లాంటి హీరోయిన్ ని బన్నీకి చెల్లి చేశావు కదా అరవింద్ గారు అంటూ ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు . ఏదేమైనా సరే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏం మాట్లాడినా ట్రోల్ చేస్తూ పెద్ద తలనొప్పులు క్రియేట్ చేస్తున్నారు . ప్రజెంట్ అనుపమ పరమేశ్వరన్ -అల్లు అర్జున్ పేర్లు సోషల్ మీడియా లో వైరల్ గా మారారి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news