Moviesఅడ‌వి శేష్‌తో డేట్ కోర‌కున్న అమ్మాయి.. ఇప్పుడే వ‌చ్చేయ్ అంటూ అదిరే...

అడ‌వి శేష్‌తో డేట్ కోర‌కున్న అమ్మాయి.. ఇప్పుడే వ‌చ్చేయ్ అంటూ అదిరే ట్విస్ట్ ఇచ్చాడుగా…!

టాలీవుడ్ యంగ్ హీరో అడ‌వి శేష్ న‌టించిన లేటెస్ట్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ హిట్ 2. హిట్ లాంటి సూప‌ర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ సినిమా శుక్ర‌వారం రిలీజ్ అయ్యింది. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే సినిమాకు సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చేసింది. ఇది శేష్‌కు వ‌రుస‌గా ఆరో హిట్‌. ఇప్పుడున్న యంగ్ హీరోల‌కు ఇటీవ‌ల కాలంలో ఆరు వ‌రుస హిట్లు ఇద్ద‌రికే ఉన్నాయి. టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు టెంప‌ర్ సినిమా నుంచి ఈ యేడాది వ‌చ్చిన త్రిబుల్ ఆర్ వ‌ర‌కు ప్లాప్ అన్న‌దే లేదు. ఆరు సినిమాలు సూప‌ర్ హిట్టే.

ఆ త‌ర్వాత ఒక్క అడ‌వి శేష్‌కు మాత్ర‌మే ఆరు వ‌రుస హిట్లు ప‌డ్డాయి. ఇక తాజాగా వ‌చ్చిన హిట్ 2 ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు 11.27 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. శేష్ కెరీర్‌లోనే ఇది హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. గూఢ‌చారి, మేజ‌ర్ సినిమాల‌కు కూడా ఈ రేంజ్‌లో ఫ‌స్ట్ డే వ‌సూళ్లు రాలేదు. దీనిని బ‌ట్టి సినిమా సినిమాకు శేష్ మార్కెట్ ఎంత‌లా పెరిగిపోతోందో తెలుస్తోంది.

ఇక హిట్ 2 ఖ‌చ్చితంగా రు. 50 కోట్ల వ‌సూళ్లు దాట‌డంతో పాటు శేష్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కుతుంద‌న్న అంచ‌నాలు అయితే ఉన్నాయి. ఈ స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న అడ‌వి శేష్ త‌న ఆనందాన్ని ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. ఓ అమ్మాయి మ‌నం ఎప్పుడు డేట్‌కు వెళ‌దాం అంటూ కొంటెగా క‌వ్వించింది. వెంట‌నే శేష్‌.. ఇదిగో ఇప్పుడే వ‌చ్చేస్తున్నా.. మ‌నం ఇద్ద‌రం క‌లిసి హిట్ 2 సినిమా చూద్దాం అని బ‌దులిచ్చాడు.

మ‌రో నెటిజ‌న్ హిట్ యూనివ‌ర్స్‌లోకి మ‌హేష్‌బాబును ఎంట్రీ చేయిస్తే నెక్ట్స్ లెవ‌ల్‌కు వెళ్లిపోతుంద‌ని అన్నాడు. ఓ మంచి స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ లైన్ రాసి మ‌హేష్ అన్న‌తో చేయండ‌న్న‌.. అది నా కోరిక అని చెప్పాడు. వెంట‌నే శేష్ ఈ రోజు ఉద‌య‌మే ఆయ‌న ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడారు. నా విష‌యంలో ఆయ‌న గ‌ర్వంగా ఫీల‌వుతున్నాన‌ని చెప్పారు. ఆ వెంట‌నే నా క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయ‌ని శేష్ చెప్పాడు.

ఆయ‌న నా సోద‌రుడిలా వెన్నంటే ఉంటాన‌ని చెప్పార‌ని.. ఆయ‌న‌కు హిట్ 2 సినిమా ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నాన‌ని చెప్పారు. ఇక అడ‌వి శేష్ కెరీర్ ఎదుగుద‌ల‌లో మ‌హేష్ పాత్ర కూడా ఉంది. గూఢ‌చారి సినిమా ట్రైల‌ర్‌తో మెస్మ‌రైజ్ అయిన మ‌హేష్ శేష్ హీరోగా వ‌చ్చిన మేజ‌ర్ సినిమా నిర్మాణ భాగ‌స్వామిగా మారిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news