Moviesరష్మిక మందన్నను టాలీవుడ్‌లో తొక్కేస్తోందెవ‌రు... అదే ఆమెకు శాప‌మైందా..!

రష్మిక మందన్నను టాలీవుడ్‌లో తొక్కేస్తోందెవ‌రు… అదే ఆమెకు శాప‌మైందా..!

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఒక్కసారిగా సౌత్‌లో స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థం కూడా రద్దు చేసుకొని హీరోయిన్‌గా సెటిలవ్వాలనుకోవడం ఇప్పుడున్న భారీ పోటీలో చాలా గొప్ప విషయం. సాధారణంగా ఏ ఒక్కరు సినిమా కెరీర్ కోసం జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోరు. అలాంటిది రష్మిక ఏ నమ్మకంతో రద్దు చేసుకుందో గానీ తాను అనుకున్నది సాధించింది.

ఒకవేళ పెళ్లి చేసుకొని ఉంటే రష్మిక మందన్న ఎవరూ..? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ కలిగేది. కానీ, రష్మిక ఆ రోజు తీసుకున్న నిర్ణయంతో నేడు రష్మిక మందన్న పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‌గా వెలుగుతోంది. అయితే, ఇటీవల రష్మిక మందన్న నటించిన సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. దీనికి కారణం అమ్మడు సినిమాలు కమిటవడానికి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండటమేనట.

పుష్ప సినిమాకి ముందు రష్మిక మందన్న నటించిన సినిమాలు అంత సక్సెస్ సాధించలేదు. కానీ, పుష్ప ఏకంగా తనని పాన్ ఇండియా స్టార్‌ను చేసేసింది. దాంతో ఎక్కువగా హిందీ సినిమాలు ఒప్పుకుంది. రష్మిక మందన్న తెలుగులో చేస్తున్న సినిమా పుష్ప సీక్వెల్. అలాగే, తెలుగు – తమిళంలో విజయ్ సరసన ఒక సినిమా చేస్తుంది. అవి తప్ప తెలుగులో కొత్తగా ఒప్పుకున్న సినిమాలు ఏవీ లేవనే చెప్పాలి.

హిందీలో నటించిన గుడ్‌బై ఫ్లాపయిన సంగతి తెలిసిందే. కొత్తగా అమ్మడు హిందీలో గానీ, మిగతా సౌత్ భాషలలో గానీ కమిటైన సినిమాలు లేవు. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం ఉన్నా కూడా రష్మికకి ఆ అవకాశాలు దక్కడం లేదంటున్నారు. దీనికి కారణం పూజా హెగ్డేను చూసి రష్మిక మందన్న కూడా రెమ్యునరేషన్ భారీగా పెంచిందట.

అయితే ఆమెకు ఛాన్సులు ఇవ్వ‌కుండా తొక్కేస్తున్నార‌న్న ప్ర‌చారం ఉన్నా అది కేవ‌లం పుకారు మాత్ర‌మే. ఆమెకు స్టార్ డ‌మ్ వ‌చ్చిన వెంట‌నే యాట్యిట్యూడ్ చూపించ‌డం.. రెమ్యున‌రేష‌న్ పెంచేయ‌డ‌మే ఆమెకు ఇక్క‌డ ఛాన్సులు రాక‌పోవ‌డానికి కార‌ణం. అందుకే ఆమెకు ఛాన్సులు ఇచ్చే విష‌యంలో టాలీవుడ్ మేకర్స్ ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news