Moviesత్రివిక్ర‌మ్‌తో సినిమా క‌న్‌ఫార్మ్‌... చాలా తెలివిగా ట్విస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్‌...!

త్రివిక్ర‌మ్‌తో సినిమా క‌న్‌ఫార్మ్‌… చాలా తెలివిగా ట్విస్ట్ ఇచ్చిన ఎన్టీఆర్‌…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ‌తో సినిమా చేస్తున్నాడు. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ సినిమా. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న కెరీర్‌లో 31వ సినిమా చేస్తాడు. ఇది పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్క‌నుంది. వ‌చ్చే స‌మ్మ‌ర్ నుంచి షూటింగ్ అనుకుంటున్నారు. త్రివిక్ర‌మ్ కెరీర్ స్టార్ట్ అయ్యి… ఎన్టీఆర్‌కు 20 ఏళ్ల క్రితం స్టార్‌డ‌మ్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే త్రివిక్ర‌మ్‌తో సినిమా వ‌స్తే బాగుంటుంద‌ని కోరుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు.

ఎట్ట‌కేల‌కు 2018లో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా ఈ కాంబినేష‌న్ సెట్ అయ్యింది. త్రిబుల్ ఆర్‌కు ముందు ఈ సినిమా రాగా.. త్రిబుల్ ఆర్ త‌ర్వాత వెంట‌నే మ‌ళ్లీ వీరి కాంబినేష‌న్ సెట్ అయిపోయింది. ఇక సెట్స్ మీద‌కు వెళ్ల‌డ‌మే ఆల‌స్యం అనుకుంటోన్న స‌మ‌యంలో ఎక్క‌డ తేడా వ‌చ్చిందో.. ఎన్టీఆర్‌కు, త్రివిక్ర‌మ‌కు కుద‌ర్లేదు. ఈ ప్రాజెక్టు సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే ఆగిపోయింది.

ఇక ఇప్ప‌ట్లో త్రివిక్ర‌మ్ – ఎన్టీఆర్ కాంబినేష‌న్ మ‌రోసారి చూడ‌లేమోన‌ని అంద‌రూ అనుకున్నారు. ఈ లోగా త్రివిక్ర‌మ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో క‌మిటైపోయాడు. అయితే రీసెంట్‌గా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న‌తో ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌కు దారులు మూసుకుపోలేద‌ని క్లారిటీ వ‌చ్చింది. టాలీవుడ్‌కు చెందిన ఓ పెద్ద నిర్మాత ఎన్టీఆర్‌ను క‌లిసి త‌న బ్యాన‌ర్లో ఓ సినిమా చేయ‌మ‌ని రిక్వెస్ట్ చేశార‌ట‌.

ఆ పెద్ద నిర్మాత ఎన్టీఆర్ డేట్ల కోసం ఎప్ప‌టి నుంచో తిరుగుతున్నాడు. ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నాడు. ఇక ఆయ‌న‌కు ఏం చెప్పాలో తెలియ‌క ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్‌ను తెచ్చుకుంటే సినిమా చేసేందుకు త‌న‌కేం అభ్యంత‌రం లేద‌ని క్లారిటీ ఇచ్చేశాడ‌ట‌. దీంతో ఆ నిర్మాత ఏం చేస్తాడు… ఎన్టీఆర్‌తో సినిమా చేయాలంటే త్రివిక్ర‌మ్‌ను ఒప్పించుకోవాలి క‌దా.. ! త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఎన్టీఆర్ చెప్పిన విష‌యం చెప్పాడ‌ట‌.

దీంతో త్రివిక్ర‌మ్ త‌ప్ప‌కుండా అని చెప్పి పంపాడ‌ట‌. కానీ ఇక్క‌డే అస‌లు క‌థ ఉంది. త్రివిక్ర‌మ్ హారిక హాసిని బ్యాన‌ర్లో కాకుండా బ‌య‌ట సినిమాలు చేయ‌డు. మ‌రి త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్ అడ‌గ‌మ‌న్నాడ‌ని ఓకే చెప్పాడా ? లేదా బ‌య‌ట బ్యాన‌ర్లో అయినా చేస్తాడా ? అన్న‌ది తెలియ‌దు కాని.. మొత్తానికి ఈ కాంబినేష‌న్‌పై ఆశ‌లు అయితే చిగురిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news