Moviesబిగ్ బాస్ కంత్రీ ప్లాన్.. మెరీనా ని పంపించేసింది అందుకేనా..? ఇప్పుడు...

బిగ్ బాస్ కంత్రీ ప్లాన్.. మెరీనా ని పంపించేసింది అందుకేనా..? ఇప్పుడు ఆటలో అసలైన మజా..!!

అసలే దరిద్రంగా టిఆర్పిలు సంపాదించుకుంటున్న బిగ్ బాస్ 6 రానున్న రోజుల్లో మరింత చెత్త టాక్ సంపాదించుకుంటుందా అంటే అవుననే అంటున్నారు బుల్లితెర విశ్లేషకులు. ఎప్పుడు లేని విధంగా బిగ్ బాస్ పరమ చెత్త డెసిషన్ తీసుకుంటూ సొంత నిర్ణయాలతో టాప్ కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తున్నాడు అన్న టాక్ ఎక్కువగా వినిపిస్తుంది . మనకు తెలిసిందే భారీ అంచనాల మధ్య స్టార్ట్ అయిన బిగ్ బాస్ 6 ..ప్రజెంట్ 12వ వారం ఎపిసోడ్ జరుగుతున్నాయి.

కాగా ఇప్పటికే హౌస్ నుంచి టాప్ సెలబ్రిటీస్ ఫేమస్ కాంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి హౌస్ లోని కళ మొత్తం పోయింది అంటూ బిగ్ బాస్ వ్యూవర్స్ బాధపడుతూ ఉంటే .. ఎవరు ఊహించిన విధంగా 11 వ వారం హౌస్ లో వన్ ఆఫ్ ద కలర్ఫుల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న మెరీనా ను ఎలిమినేట్ చేయడం సంచలనంగా మారింది. నిజానికి హౌస్ లో ఉన్న అందరితో కంపేర్ చేస్తే మెరీనా ఆటలో బాగా ఆడుతుంది ..గ్లామర్ పరంగా ట్రీట్ బాగానే అందిస్తుంది . మరి ముఖ్యంగా తన హస్బెండ్ రోహిత్ తో కలిసి రొమాంటిక్ క్లిప్స్ ను అందిస్తుంది . అయితే బిగ్ బాస్ ఎవరు ఊహించిన విధంగా మెరీనాను ఎలిమినేట్ చేయడం శ్రీ సత్యను సేవ్ చేయడం సంచలనంగా మారింది .

అంతటి గ్లామరస్ బ్యూటీని ఎలిమినేట్ చేయడానికి మెయిన్ రీజన్ తన హస్బెండ్ రోహిత్ అని తెలుస్తుంది. రోహిత్ చాలా సైలెంట్ కానీ గేమ్స్ పరంగా జెన్యూన్ గా ఆడతాడు . మంచి టాలెంట్ ఉంది . అతని ని మెరీనా కంట్రోల్ చేస్తుందన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది . నిజానికి మెరీనా ఎలిమినేట్ అయితే రోహిత్ ఒంటరి వాడు అవుతారు. అప్పుడు గేమ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ..వేరే అమ్మాయిని కనెక్ట్ చేయొచ్చు.. దీంతో కాస్తో కూస్తో టీఆర్పీలు పెంచచ్చు అన్న మైండ్ బ్లాకింగ్ స్ట్రాటజీతో మెరీనాను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తుంది .

అంతేకాదు రానున్న రోజుల్లో బిగ్ బాస్ రోహిత్ కు హౌస్ లో ఉండే శ్రీ సత్య తో లవ్ ట్రాక్ నడిపే సింటమ్స్ కూడా ఉన్నాయి అంటున్నారు బుల్లితెర విశ్లేషకులు. ఏది ఏమైన చూడచక్కగా ఉన్న ఈ జంట విడిపోవడం.. ఒకరు హౌస్ లో ఒక హౌస్ బయట ఉండడం చాలా బాధాకరం అంటున్నారు ఈ జంట ఫ్యాన్స్ . చూద్దాం బిగ్ బాస్ వలలో రోహిత్ పడతాడో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news