Moviesఆ సీన్స్ లో నటిస్తే అంతే.. స్టార్ హీరోయిన్ మదర్ సంచలన...

ఆ సీన్స్ లో నటిస్తే అంతే.. స్టార్ హీరోయిన్ మదర్ సంచలన కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావడం పెద్ద గొప్ప విషయం కాదు . వచ్చిన తర్వాత ఆ హీరోయిన్ ఎలాంటి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంది ..ఎలాంటి హిట్లు తన ఖాతాలో వేసుకుంది.. అలా స్టార్ హీరోయిన్గా ఎన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీని ఏలేసింది.. ఈ ట్రాక్ రికార్డును ముఖ్యంగా గమనిస్తారు సినీ విశ్లేషకులు .అయితే అలా హీరోయిన్ నుంచి స్టార్ హీరోయిన్గా మారాలంటే అన్ని రోల్స్ చేయగలగాలి.

మా అమ్మ చెప్పింది ..నేను అలాంటి రోల్స్ చేయను అంటూ భీష్ముంచుకుని కూర్చుంటే స్టార్ హీరోయిన్గా ఎదగలేరు. అలాంటి కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది కృతిసనన్. ఈ బోల్డ్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలు బిగ్ ప్రాజెక్ట్ లో నటించి సూపర్ డూపర్ హిట్ లను తన ఖాతాలో వేసుకుంది. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ తో నటించిన కృతి ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనుంది .

ఈ సినిమా హిట్ అయితే పాన్ ఇండియా లెవెల్ లో కృతి పేరు మారుమ్రోగిపోతుంది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బోల్డ్ బ్యూటీ కృతి తన లైఫ్ సీక్రెట్ గురించి షేర్ చేసుకుంది ..”నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చే కొత్తల్లో మా అమ్మ నాతో ఒక మాట చెప్పింది. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి రోల్స్ నైనా చేయాలి అంటారు.. కానీ నువ్వు లవ్ స్టోరీలు ,రొమాన్స్ జోలికి వెళ్లొద్దు నిన్ను అలాంటి సీన్స్ లో చూడడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది . ఇప్పుడు జనాలు బాగానే నేను ఎంకరేజ్ చేస్తారు .కొన్నాళ్ల తర్వాత అదే సీన్స్ పట్టుకొని నిన్ను ట్రోల్ చేస్తారు. ఆ బాధను మేము భరించలేం నీ ఇష్టప్రకారం హీరోయిన్ అయ్యావు ..మా ఇష్ట ప్రకారం మా పరువును తీయొద్దు” అంటూ చెప్పుకొచ్చింది. కానీ అమ్మ మాటలను ఏ మాత్రం పట్టించుకోలేదు ఈ బ్యూటి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news