Moviesన‌రేష్ - ప‌విత్రా లోకేష్ ఉన్న ప‌రువు కూడా పోగొట్టుకుంటున్నారా... మ‌రో...

న‌రేష్ – ప‌విత్రా లోకేష్ ఉన్న ప‌రువు కూడా పోగొట్టుకుంటున్నారా… మ‌రో చెత్త డెసిష‌న్‌…!

ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ నటుడు నరేష్, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేష్ సహజీవనం ఎంత హాట్‌ టాపిక్ గా మారిందో చూస్తూనే ఉన్నాం. అసలు గత ఆరేడు నెలలుగా నరేష్-పవిత్ర లోకేష్ తెలుగు సోషల్ మీడియా జనాలకు కావాల్సినంత స్టఫ్ ఇస్తున్నారు. ఇప్పటికే నరేష్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరు భార్యలకు విడాకులు ఇవ్వగా.. మూడోసారి రమ్య రఘుపతిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కూడా ఒక కుమారుడు ఉన్నారు. రమ్య రఘుపతి ఎవరో కాదు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే క్రమంలో నరేష్‌తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఈ సాన్నిహిత్యం పెళ్ళి వరకు వెళ్లింది.

మాజీ మంత్రి రఘువీరా రెడ్డికి… రమ్య సోదరుడి కుమార్తె అవుతుంది. అయితే గత రెండేళ్లుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు నేపథ్యంలో విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నరేష్ – పవిత్ర లోకేష్‌తో సహజీవనం చేస్తుండడంతో రమ్య వీరిద్దరిపై తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. కర్ణాటకలోని ఒక హోటల్ లో నరేష్ – పవిత్ర కలిసి ఉండగా రమ్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం… ఆ వెంటనే నరేష్ ఆమెను గేలిచేయటం అందరూ చూశారు. ఇక నరేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మృతి చెందడంతో ఎంతో మంది సెలబ్రిటీలు ఆయనకు నివాళులు అర్పించేందుకు వచ్చారు.

ఆ సమయంలోను పవిత్రను న‌రేష్‌ చాలామందికి పరిచయం చేయటం కూడా అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అటు పవిత్ర లోకేష్ కు కూడా ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. తన రెండవ భర్తకు విడాకులు ఇవ్వకుండానే నరేష్‌తో సహజీవనం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక నరేష్ వయసు 63 సంవత్సరాలు కాగా… పవిత్ర వయసు 43.. వీరిద్దరి మధ్య 20 సంవత్సరాలకు పైగా తేడా ఉంది. అయినా కూడా పవిత్ర నరేష్‌తో సహజీవనం చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

ఇప్పటికే తమ చర్యలతో మీరిద్దరూ పరువు పోగొట్టుకోగా ఇప్పుడు మరో చెత్త నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు కూడా ఇద్దరి మీద వస్తున్నాయి. త్వరలోనే ఈ జంట హీరో, హీరోయిన్‌గా ఒక సినిమాలో నటించబోతున్నట్టు ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నరేష్-పవిత్ర ఇద్దరు తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలను చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను స్వయంగా నరేష్ తన బ్యానర్ పై నిర్మించేందుకు రెడీ అవుతున్నారట.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ లో నరేష్ – పవిత్ర ఎలాంటి సవాళ్లతో ముందుకు వెళుతున్నారు ? అసలు వీరిద్దరూ కలిసి జీవించాలన్న నిర్ణయం తీసుకోవడం వెనక వారి జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయ‌న్న దానిపై ఈ కథ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నరేష్- పవిత్ర కలిసి భార్యాభర్తలుగా చాలా సినిమాల్లో నటించారు. అయితే ఇప్పుడు సహజీవనం చేస్తూ తొలిసారి హీరో , హీరోయిన్లుగా నటిస్తుండడంతో ఈ సినిమాకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

అసలు తమ చుట్టూ వస్తున్న విమర్శలకు క్లారిటీ ఇచ్చేందుకే ఈ సినిమా తీస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే కథలో తమ సాన్నిహిత్యం, ప్రేమతో పాటు కొంచెం ఫిక్షన్ కూడా జోడిస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా నరేష్- పవిత్ర లోకేష్ కలిసి అందరూ బాగుండాలి అందులో మేముండాలి అనే సినిమాలో నటించిగా ఇది ఆహా ఓటీటీలో నేరుగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఏదేమైనా నరేష్- పవిత్ర లోకేష్ తమపై వస్తున్న విమర్శలను అలా వదిలేయకుండా.. ఇప్పుడు వాటికి కౌంటర్‌గా సినిమా తీస్తుండటం రకరకాల చర్చలకు తావిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news