Moviesజైలు నుంచి బాల‌య్య రిలీజ్‌... గూస్‌బంప్స్‌తో థియేటర్ల‌లో మోత మోగిపోవాల్సిందే...!

జైలు నుంచి బాల‌య్య రిలీజ్‌… గూస్‌బంప్స్‌తో థియేటర్ల‌లో మోత మోగిపోవాల్సిందే…!

బాలయ్య జోరు మామూలుగా లేదు.. ఓవైపు కుర్ర హీరోలు కథలు దొరకక.. హీరోయిన్లు సెట్ కాక అల్లాడిపోతున్నారు. అన్ని దొరికినా కూడా సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో ? ఎప్పుడు షూటింగ్ పూర్తి అవుతుందో ? ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా అర్థం కావటం లేదు. రామ్ చరణ్- ఎన్టీఆర్- అల్లు అర్జున్- మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేసేందుకు కూడా అష్ట కష్టాలు పడుతున్నారు.

సీనియర్ హీరోల‌లో బాలకృష్ణ- చిరంజీవి మాత్రం వరుసగా ఒక సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమాను లైన్లో పెట్టుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక బాలయ్య దూకుడుకు బ్రేకులు వేయటం ఇప్పటిలో ఎవరికీ సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. అఖండ సినిమాతో ‘అఖండ’ గర్జన మోగించిన బాలయ్య.. ఇటు బుల్లితెరపై అన్ స్టాపబుల్ షో తో తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఇక రీసెంట్గా ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’ కూడా ప్రారంభమై సక్సెస్ పుల్‌గా దూసుకుపోతోంది.

బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహారెడ్డి’ సినిమా చేస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వీర సింహారెడ్డి తర్వాత బాలయ్య – అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాను పట్టాలు ఎక్కించేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. బాలయ్య వ‌రుస‌పెట్టి చకచకా సినిమాలు చేసుకునేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది.

ఇక అనిల్ రావిపూడి సినిమాలో బాలయ్య కొన్ని సంవత్సరాలు పాటు జైలులో ఉండి బయటకు వచ్చే వ్యక్తిగా కనిపించనున్నాడు. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ ఆధ్వర్యంలో ఓ భారీ జైలు సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. చెన్నకేశవరెడ్డి సినిమా తరహాలో బాలయ్య జైలుకు వెళ్లడం… కొన్నేళ్లపాటు జైల్లో ఉండటం ఆ తర్వాత తిరిగి రావటం లాంటి అంశాలన్నీ చాలా ఆసక్తిగా ఉంటాయని తెలుస్తోంది. ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాలో బాలయ్య జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు… ఆ తర్వాత సీన్లు అన్ని గూస్ బంప్ తెప్పించడంతో పాటు థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా ఉంటాయి.

ఇప్పుడు ఈ సినిమాలో కూడా అనిల్ రావిపూడి జైల్లో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సీన్లు కూడా బాగా డిజైన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్‌ను తీసుకున్నారు. థ‌మన్ సంగీతం అందిస్తున్నారు. యంగ్ హీరోయిన్ శ్రీలీల‌ బాలయ్య కూతురుగా నటిస్తోంది. ఇక హీరోయిన్‌తో పాటు మిగిలిన నటీనటులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాడు దర్శకుడు అనిల్.. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news