Moviesటాలీవుడ్‌లో ఈ ముగ్గురు హీరోలు చాలా గ్రేట్‌... ఈ నంద‌మూరి హీరోల...

టాలీవుడ్‌లో ఈ ముగ్గురు హీరోలు చాలా గ్రేట్‌… ఈ నంద‌మూరి హీరోల గొప్ప మ‌న‌సుకు ఇదే సాక్ష్యం..!

టాలీవుడ్‌లో నంద‌మూరి కుటుంబానికి ఉన్న ఘ‌న‌త ఈ రోజు కొత్త‌గా చెప్ప‌క్క‌ర్లేదు. ఆరేడు ద‌శాబ్దాల నుంచి ఈ ఫ్యామిలీ తెలుగు ప్రేక్ష‌కులు, తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌స్సుల‌ను గెలుచుకుంటోంది. ఎన్టీఆర్ వేసిన బ‌ల‌మైన పునాది త‌ర్వాత ఆయ‌న ఇద్ద‌రు త‌న‌యులు బాల‌కృష్ణ‌, హ‌రికృష్ణ కూడా సీనీ రంగంలోకి వ‌చ్చారు. బాల‌య్య అయితే ఈ వ‌య‌స్సులోనూ తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఇక మూడో త‌రంలో హ‌రికృష్ణ త‌న‌యుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఉన్నాడు.

అయితే నంద‌మూరి ఫ్యామిలీ ఎప్పుడూ కూడా త‌మ క్షేమం కంటే ఇండ‌స్ట్రీ క్షేమం కోరుకుంటుంది. ఇండ‌స్ట్రీ అంతా ప‌చ్చ‌గా ఉంటేనే మ‌నం కూడా ప‌చ్చ‌గా ఉంటాం అన్న‌దే వాళ్ల కాన్సెఫ్ట్‌. ఎన్టీఆర్ ఆ త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు బాల‌య్య‌, ఇప్పుడు మూడో త‌రంలో ఎన్టీఆర్ కూడా నిర్మాత‌ల‌తో పాటు త‌మ‌తో ప‌నిచేసే తోటీ న‌టులు, టెక్నీషియ‌న్ల‌కు ఎంతో గౌర‌వం ఇస్తారు.. ఎవ్వ‌రిని ఇబ్బంది పెట్టారు.

ఇక ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ప‌రిస్థితులు మారిపోయాయి. నీకు ఎంత నాకు ఎంత ? అన్న లెక్క‌లు వ‌చ్చ‌చేశాయి. అస‌లు ఈ రోజు సినిమాను న‌మ్ముకుని బ‌తికే నిర్మాత అన్న‌వాళ్లు ఎవ్వ‌రూ క‌న‌ప‌డ‌డం లేదు. సినిమా ప్లాప్ అయితే నిర్మాత ఇండ‌స్ట్రీలో ఉండే ప‌రిస్థితి లేదు. ఈ రోజు హీరోలు కూడా ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఒక్క హిట్ ప‌డితే రెమ్యున‌రేష‌న్లు కోట్ల‌కు కోట్లు పెంచేసి నిర్మాత‌ల‌ను న‌ట్టేట ముంచేస్తున్నారు.

అస‌లు ఒక్క హిట్ ప‌డితే చాలు ముక్కూ మొహం తెలియ‌ని హీరో కూడా మ‌రుస‌టి సినిమాకే రేట్లు పెంచేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ ఎప్పుడు హిట్ వ‌స్తే అప్పుడు రేటు పెంచేందుకు ఇష్ట‌ప‌డే వారు కాద‌ట‌. ప‌క్క‌న ఉన్న వారు ఎవ‌రైనా రేటు పెంచ‌మ‌ని అడిగితే.. ఏంటి బ్ర‌ద‌ర్ అలా అంటున్నారు.. మ‌న‌తో సినిమా తీసిన నిర్మాత‌కు నాలుగు రూపాయ‌లు వ‌స్తే తింటాడు… వాళ్లు, వాళ్ల పెళ్లాం, బిడ్డ‌లు చేసుకున్న అదృష్టం అది… ఎక్క‌డికి పోతాడు… మ‌ళ్లీ మ‌న‌తోనే సినిమా తీస్తాడు క‌దా… మ‌నం రేటు పెంచ‌మ‌ని.. రెమ్యున‌రేష‌న్ ఎక్కువ ఇవ్వ‌మ‌ని అడ‌గ‌డం స‌రికాద‌ని అనేవార‌ట‌.

అలాగే ఏ నిర్మాత అయినా ఇబ్బందుల్లో ఉంటే ఎంత ఇస్తే అంతే తీసుకునేవార‌ట‌. సినిమాల రిలీజ్ ఆగిపోతే ఆయ‌నే స్వ‌యంగా హెల్ఫ్ చేసి సినిమా రిలీజ్ అయ్యేలా చేసేవార‌ట‌. ఇక ఆయ‌న ల‌క్ష‌ణ‌మే ఆయ‌న త‌న‌యుడు బాల‌య్య‌కు కూడా వ‌చ్చింది. అస‌లు నిర్మాత‌ల‌ను బాల‌య్య ఎప్పుడూ ఇబ్బంది పెట్టింది లేదు. ఆయ‌న రేంజ్ హీరోలు ఒక్కో సినిమాకు రు. 50 కోట్లు, రు. 60 కోట్లు అంటున్నారు. అయితే బాల‌య్య అఖండ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయినా పెంచింది మాత్రం రు. 2 కోట్లే. ఇప్పుడు బాల‌య్య రెమ్యున‌రేష‌న్ రు. 12 కోట్ల రేంజ్‌లో న‌డుస్తోంది.

నిర్మాత ఎంత ఇస్తాన‌న్నా కూడా ఓకే చెప్పే మ‌న‌స్త‌త్వం బాల‌య్య‌ది. నిర్మాత‌లు, రెమ్యున‌రేష‌న్ల విష‌యంలో బాల‌య్య‌ది భోళా మ‌న‌స్త‌త్వం. అస్స‌లు నిర్మాత‌ల‌ను ఇబ్బంది పెట్ట‌కూడ‌ద‌నే ఆయ‌న అంటారు. నిర్మాత అనే వాడు బ‌తికి ఉంటేనే క‌దా సినిమా ఇండ‌స్ట్రీలో న‌లుగురికి ప‌నిదొరికేది.. ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లేది అన్న‌దే ఆయ‌న సూత్రం. అస‌లు స‌మ‌ర‌సింహారెడ్డి లాంటి సినిమా హిట్ అయ్యాక కోటిన్న‌ర ఇచ్చేందుకు ఓ నిర్మాత ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళితే ఆయ‌న అడిగిన రెమ్యున‌రేష‌న్ జ‌స్ట్ రు. 65 ల‌క్ష‌లు మాత్ర‌మే. అది కూడా రు. 60 ల‌క్ష‌లే అడిగిన బాల‌య్య‌.. వీలుంటేనే మ‌రో రు. 5 ఇవ్వ‌మ‌ని చెప్పారు.

ఇక ఇప్పుడు అదే నంద‌మూరి వంశంలో మూడో త‌రం హీరోగా ఉన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ సైతం వ‌రుస‌గా ఆరు హిట్లు ప‌డినా రెమ్యున‌రేష‌న్ పెంచ‌లేదు. త్రిబుల్ ఆర్ కోసం ఎన్నో సినిమాలు వ‌దులుకున్న ఎన్టీఆర్ ఆ సినిమాకు తీసుకున్న రెమ్యున‌రేష‌న్ రు. 45 కోట్లే. ఇప్పుడు ఎన్టీఆర్ రేంజ్ హీరోలు రు. 60, 70 కోట్లు అంటున్నా… ఎన్టీఆర్ రు. 40 – 45 కోట్ల రేషియోలోనే తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ కూడా నిర్మాత‌ల‌ను ఇబ్బంది పెట్టేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌డు. త‌న సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోవ‌డం ఎన్టీఆర్‌కు అస్సలు న‌చ్చ‌దు. ఏదేమైనా నిర్మాత‌లు, ఇండ‌స్ట్రీ శ్రేయ‌స్సును కాంక్షించే విష‌యంలో నంద‌మూరి హీరోల‌కు మించిన హీరోలు ఉండ‌ర‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news