Moviesనాగశౌర్య ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా..? పెళ్ళి తంతు లో అదే...

నాగశౌర్య ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా..? పెళ్ళి తంతు లో అదే హైలెట్..!!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న నాగశౌర్య ..నిన్న అనూష మెడలో తాళి కట్టి ఓ ఇంటివాడు అయిపోయాడు . దీంతో నాగశౌర్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు . టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో హీరో నాగ శౌర్యకు ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయకుండా.. తన పని తాను చూసుకుంటూ ..వచ్చిన సినిమా అవకాశాలలో నచ్చిన సినిమాలను చేస్తూ.. జనాలను మెప్పించడంలో నాగశౌర్య ది నెంబర్ వన్ అని చెప్పాలి.

ఇప్పటివరకు యాడ్ చేసిన సినిమాలు అన్నీ చూసుకుంటే ..నటనలో పూర్తి వేరియేషన్స్ చూపిస్తూ ఉన్న పాత్రలే మనకు కనిపిస్తాయి . రీసెంట్గా కృష్ణవింద విహారి అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో రీసెంట్ గా తన ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసి ఓ ఇంటివాడు అయ్యాడు. నాగశౌర్య బెంగళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూషను పెళ్లి చేసుకున్నాడు . కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన అనూష ..నాగశౌర్య ముందు ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఇక ఆ తర్వాత వాళ్ళ మనసులు కలవడంతో .. వారి స్నేహం ప్రేమగా మారింది .

ఇక తర్వాత ఆ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు . అనూష – నాగశౌర్య బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఇంటీరియర్ డిజైనర్ గా ఫేమస్ అయిన అనూష శెట్టిని తన భార్యగా జీవితంలోకి ఆహ్వానించారు నాగశూర్య. వీళ్ల పెళ్ళి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అనూష బ్యాక్ గ్రౌండ్ తెలిసిన క్రమంలో నాగశౌర్య ఎంత కట్నం తీసుకున్నాడు అనే విషయం ట్రెండీగా మారింది.

అనూష శెట్టి బ్యాగ్రౌండ్ చాలా పెద్దది . కోట్ల ఆస్తికి అధిపతిరాలు. అంతేకాదు నాగశౌర్యకు అనూష ఫ్యామిలీ భారీగానే కట్నం ఇచ్చినట్లు తెలుస్తుంది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సుమారు 40-50 కోట్లు దాకా అనుష నుండి నాగశౌర్యకు కట్నం వచ్చినట్లు న్యూస్ క్రేజీగా మారింది. ఏది ఏమైనా సరే అందమైన భార్యతో పాటు కోట్ల ఆస్తి కొట్టేసాడు నాగశౌర్య అంటూ కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news