Moviesబిగ్ బ్రేకింగ్: పెళ్ళికి రెడీ అయిన తెలుగు హీరో .. ఫైనల్లీ...

బిగ్ బ్రేకింగ్: పెళ్ళికి రెడీ అయిన తెలుగు హీరో .. ఫైనల్లీ ఆ అమ్మాయినే చేసుకోబోతున్న నాగ శౌర్య..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్నారు స్టార్ హీరో, హీరోయిన్లు . ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కత్రినా కైఫ్, అలియా భట్.. కోలీవుడ్ స్టార్ హీరో ఆది పినిశెట్టి.. అందరూ పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోయారు . కాగా రీసెంట్ గానే కోళీవుడ్ హీరో విశాల్ సైతం తన పెళ్లి వార్తను అఫీషియల్ గా ప్రకటించారు . తను ఒక ప్రాజెక్టులో బిజీగా ఉన్నానని ..ఆ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వగానే పెళ్లి చేసుకుంటారని.. కచ్చితంగా ప్రేమ పెళ్లి చేసుకుంటానని అఫీషియల్ గా స్పందించాడు .

కాగా ఈ క్రమంలోని ఇండస్ట్రీలో మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. క్రికెట్ గర్ల్ అండ్ బీర్ అనే సినిమాతో హీరోగా పరిచయమైన నాగశౌర్య ..ఆ తర్వాత బోలెడు సినిమాలు చేశారు. కానీ ఏ సినిమా ఆయనకు సక్సెస్ ఇవ్వలేదు . ఊహలు గుసగుసలాడే అనే సినిమా మాత్రం శౌర్యకి మంచి బ్రేక్ ఇచ్చింది . ఆ తర్వాత హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ..వరుస సినిమాలకు కమిట్ అవుతూ ..రీసెంట్గా కృష్ణ వింద విహారి అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న నాగశౌర్య.. తన సొంత మరదలు అనూషనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది .

కాగా నాగశౌర్య వెడ్డింగ్ కార్డు ఇదే అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది . నాగశౌర్య పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు అనూష. అనూష ఎవరో కాదు ఆయన సొంత మరదలు. కాగా ఈ నెల 19న మెహంది ..20వ తేదీ ఉదయం 11 గంటల 25 నిమిషాలకు నాగశౌర్య-అనుష ల పెళ్లి బెంగళూరులో జరగబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది. అయితే దీనిపై ఇప్పటివరకు నాగశౌర్య ఏ విధంగా స్పందించలేదు . అయితే పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఫాన్స్ షాక్ అవుతున్నారు . చూద్దాం నాగశౌర్య ఈ పెళ్లిపై ఎలాంటి ప్రకటన చేస్తాడో..?

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news