Moviesక‌ళ్యాణ్‌దేవ్ శ్రీజను వాడుకున్నాడా... శ్రీజ మూడో భ‌ర్త‌కు చిరంజీవి పెట్టిన కండీష‌న్లు...

క‌ళ్యాణ్‌దేవ్ శ్రీజను వాడుకున్నాడా… శ్రీజ మూడో భ‌ర్త‌కు చిరంజీవి పెట్టిన కండీష‌న్లు ఇవే…!

మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ వ్యక్తిగత జీవితం ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ వస్తోంది. శ్రీజ ముందుగా 2008లో తన స్నేహితుడు అయిన శిరీష్ భరద్వాజను ప్రేమ వివాహం చేసుకుంది. వాస్తవానికి ఈ పెళ్లి చిరంజీవి కుటుంబ సభ్యులు ఎవరికి ఇష్టం లేదు. శ్రీజ ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు బాబాయి పవన్ కళ్యాణ్ ఎంత హడావుడి చేశాడో చూసాం. శిరీష్ ను రహస్యంగా పెళ్లి చేసుకున్న శ్రీజ ఏకంగా తన తండ్రి చిరంజీవిపైనే విమర్శలు గుప్పించింది. చిరంజీవి సైతం మీడియా ముందుకు వచ్చి ఎంతో బాధపడ్డారు. అయితే కొద్ది రోజులకే శిరీష్ భరద్వాజ్ శ్రీజను టార్చర్ పెట్టడంతో ఆ టార్చర్ తట్టుకోలేక భర్తకు విడాకులు ఇచ్చేసింది.

అప్పటికే శ్రీజకు ఒక కుమార్తె పుట్టింది. చాలా కాలం పాటు ఖాళీగా చిరంజీవి ఇంట్లోనే ఉన్న శ్రీజ మళ్లీ తమ ఫ్యామిలీకి సన్నిహితులుగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన కళ్యాణ్ దేవ్‌ను రెండో వివాహం చేసుకుంది. కళ్యాణ్‌కు కూడా ఇది రెండో పెళ్లి అని అంటారు. ఈ దంపతులకు కూడా ఒక కుమార్తె పుట్టింది. అయితే ఈ దంపతులకు పెళ్లయిన మూడేళ్ల నుంచి మనస్పర్ధలు తలెత్తాయి. ఇప్పటికే వీరిద్దరూ ఏడాదికిపైగా దూరంగా ఉంటూ వస్తున్నారు.

కళ్యాణ్ దేవ్‌ తొలి సినిమా విజేత రిలీజ్ అయినప్పుడు చిరంజీవితో పాటు మెగా కుటుంబ సభ్యులు అందరూ సోషల్ మీడియాలో ఎంతో ప్రమోట్ చేశారు. బయట కూడా ఈ సినిమాకు భారీ ఎత్తున థియేటర్లు దొరికాయి. మెగా అభిమానులు కూడా విజేత సినిమాకు పెద్ద హంగామా చేశారు. ఎప్పుడు అయితే శ్రీజ కళ్యాణ్‌దేవ్‌ని దూరం పెట్టిందో ? ఆ తర్వాత రిలీజ్ అయిన కళ్యాణ్ దేవ్ సినిమాలను ఎవరు పట్టించుకోలేదు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఈ మంది రామారావు
చెప్పిన మాట‌లు చూస్తే కళ్యాణ్.. శ్రీజ‌ వాడుకొని ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవాలని అనుకున్నాడ‌ట‌.

అప్పటికే శ్రీజ ఒక పెళ్లి జరిగి విడాకులు తీసుకుని ఇబ్బందుల్లో ఉందని.. అలాంటిది ఓ గొప్ప కుటుంబానికి చెందిన అమ్మాయిని బాగా చూసుకోవాల్సింది పోయి.. ఆమెను వాడుకుని తాను మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకొని ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలని అనుకున్నాడని.. ఈ విషయంలో తప్పంతా కళ్యాణ్ దేవ్‌దే అని రామారావు కుండబద్దలు కొట్టారు. ఈ విషయంలో చిరంజీవి కూడా కళ్యాణ్ దేవ్‌కు నచ్చితే ఎంత‌ ప్రయత్నించినా కూడా వినలేదని కూడా తెలిసింది.

పైగా శ్రీజ కళ్యాణ్ దంపతులకు పుట్టిన కుమార్తె అంటే చిరంజీవికి ఎంతో ఇష్టమని.. మనవరాలు తన సినిమాల్లో పాటలకు డ్యాన్స్ వేస్తుంటే చిరంజీవి ఎంతో మురిసిపోయే వారిని కూడా రామారావు ఈ సందర్భంగా తెలిపారు. ఇక త్వరలోనే వీరు అధికారికంగా విడాకులు కూడా తీసుకోబోతున్నారని కూడా రామారావు సూచనలు ఇచ్చేశారు. ఇక శ్రీజ మూడో పెళ్లికి కూడా సిద్ధమవుతుందని.. అయితే శ్రీజకు కాబోయే మూడో భర్త విషయంలో చిరంజీవి కొన్ని కండిషన్లు కూడా పెట్టారని ఆయన తెలిపారు.

శ్రీజకు కాబోయే మూడవ భర్త ఎవరైనా ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని.. ఆమె నుంచి ఏం ఆశించకుండా ఆమె ఏం ? కోరుకుంటుందో అందుకు అనుగుణంగా వచ్చే వ్యక్తినే అల్లుడుగా చేసుకోవాలని కూడా చిరు ఇప్పటికే డిసైడ్ అయినట్టు తెలిసింది. అంటే చిరంజీవి ఫ్యామిలీ పేరు చెప్పుకొని ఏదో ఆశించి అల్లుడు కావాలనుకునే వాళ్లకంటే… తన కుమార్తెను జాగ్రత్తగా చూసుకునే భర్త కోసమే ఈసారి చిరంజీవి అన్వేషణ చేస్తున్నట్టు రామారావు తెలిపారు.

Latest news