Moviesచిరంజీవిపై అల్లు అర‌వింద్ మ‌రీ ఇంత ప‌గ ప‌ట్టేశారా... మ‌రో షాక్...

చిరంజీవిపై అల్లు అర‌వింద్ మ‌రీ ఇంత ప‌గ ప‌ట్టేశారా… మ‌రో షాక్ కూడా…!

మెగాస్టార్ చిరంజీవి నాలుగు దశాబ్దాల కెరియర్‌లో బావమరిది అల్లు అరవింద్ పాత్ర ఎంతో ఉంది. చిరంజీవి ఈరోజు ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోగా ఉండటంలో.. ఆయన స్వయంకృషితో పాటు అల్లు ఫ్యామిలీ అండదండలు.. అందులోను అల్లు అరవింద్ ప్లానింగ్ ఎంతో ఉంది. దివంగత ప్రముఖ కమెడియన్ అల్లు రామలింగయ్య వారసుడుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ బ్యానర్ తో పాటు గీతా ఫీలింమ్స్ డిస్ట్రిబ్యూటర్స్‌ స్థాపించి టాలీవుడ్‌లో తనదైన ముద్రవేశారు. బావ చిరంజీవి హీరోగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు నిర్మించి.. చిరంజీవి ఎదుగుదలలో వెన్నుముకగా నిలిచారు.

అయితే గత నాలుగైదు సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య పోరా పచ్చలు వచ్చాయన్న పుకార్లు అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. చిరంజీవి పదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. అప్పుడు రామ్ చరణ్ సినిమాలకు సంబంధించిన విషయాలు అన్నీ అల్లు అరవింద్ మీద పెట్టేశారు. చరణ్ చేసే సినిమా కథలు వినటం దగ్గర నుంచి.. దర్శకులను ఓకే చేయటం వరకు అన్ని అరవింద్‌ స్వయంగా పర్యవేక్షించేవారు. అయితే చరణ్ కు మధ్యలో వరుసగా ప్లాప్ సినిమాలు పడ్డాయి.

ఆ టైంలో ముందుగా తన వద్దకు వచ్చిన మంచి కథలు.. మంచి దర్శకులను అరవింద్ తన కుమారుడు బన్నీ కోసం బ్లాక్ చేసుకుని ఆ తర్వాత కథ‌లని రామ్ చరణ్‌కు పంపేవార‌న్న‌ పుకార్లు వచ్చాయి. ఇదే వీరిద్దరి మధ్య గ్యాప్‌కు అసలు కారణం అని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపించిన‌ టాక్. ఖైదీ నెంబర్ 150 సినిమా రిలీజ్ వరకు కూడా బావ-బావమరుదుల మధ్య సంబంధాలు బాగానే కొనసాగాయి. బావ రీఎంట్రీ సినిమా విషయంలో అరవింద్ అన్ని తానే దగ్గరుండి చూసుకున్నారు. అయితే సైరా సినిమా దగ్గరకు వచ్చేసరికి వ్యవహారం తేడా కొట్టేసింది.

సైరా సినిమా బాధ్యతలను అన్ని చిరంజీవి తోడల్లుడు కుమార్తె చూసుకున్నారు. అప్పటినుంచి రామ్ చరణ్ నటించిన సినిమాల కథలు అన్ని చిరంజీవి కంట్రోల్లోకి వచ్చేసాయి. ముందుగా చిరంజీవి కథ విని ఓకే చేశాకే చరణ్ ఆ సినిమా చేయటం ప్రారంభమైంది. సైరా సినిమాను ఏ మాత్రం పట్టించుకోని అరవింద్ ఆ తర్వాత ఆచార్య విషయంలోనూ ముందు నుంచి సైలెంట్ గానే ఉంటూ వచ్చారు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇక గాడ్ ఫాదర్ సమయంలో అరవింద్ కూడా కావాలని పంతానికి పోయి డ‌బ్బింగ్ సినిమా కాంతారా రిలీజ్ చేయడంతో గాడ్ ఫాదర్ వసూళ్లకు బాగా దెబ్బడిపోయింది. ఈ విషయం డైరెక్ట్ గా చెప్పకపోయినా మెగా అభిమానులతో పాటు మెగా కాంపౌండ్‌ బాగా హ‌ర్ట్‌ అయినట్టు తెలిసింది.

పుండు మీద కారం చల్లినట్టుగా అరవింద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు మెగా అభిమానులకు మంట పెట్టేస్తున్నాయి. సంక్రాంతికి చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా థియేటర్లలోకి దిగుతోంది. పైగా ఈ సినిమాకు మరో స్టార్ హీరో బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి కూడా పోటీగా ఉంది. అయితే ఈ రెండు సినిమాల‌కు మధ్యలో అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు కూడా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. వారసుడు సినిమా కోసం దిల్ రాజు నైజాం, ఆంధ్రాలో భారీ ఎత్తున మంచి థియేటర్లు అన్ని ఇప్పటికే బ్లాక్ చేసేసారు.

డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ థియేటర్లు ఇస్తారా ? అన్న విమర్శలు వస్తున్న సమయంలో అరవింద్ వారసుడు సినిమాకు అనుకూలంగా మాట్లాడటం ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. ఇప్పటికే మెగా అల్లు అభిమానులుగా విడిపోయారు. సంక్రాంతికి వారసుడు సినిమాను రిలీజ్ చేస్తే తప్పేంటి ఏ సినిమా ప్రేక్షకులకు నచ్చితే ఏ సినిమా అయినా ఆదరిస్తారు.. అని అరవింద్ మాట్లాడటం వెనక పరోక్షంగా వాల్తేరు వీరయ్యను టార్గెట్ చేసినట్టుగా ఉందని మెగా వీరాభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏదేమైనా అల్లు అరవింద్ పదేపదే చిరంజీవితో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్న తెర వెనక జరుగుతున్న పరిణామాలు అనేక సందేహాలకు కారణంగా కనిపిస్తున్నాయి. కావాలని చిరంజీవి సినిమాలను పరోక్షంగా టార్గెట్ చేసేలా జరుగుతున్న పరిణామాలకు అరవింద్ సపోర్ట్ ఉందా ? అన్న చర్చ కూడా మెగా అభిమానులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు నిజాలు ఏమిటో వారిద్దరికే తెలియాలి.

Latest news