Moviesబ‌న్నీకి లైన్ వేస్తోన్న ఆ క్రేజీ హీరోయిన్ ఎవ‌రు... కార‌ణం ఏంటి...!

బ‌న్నీకి లైన్ వేస్తోన్న ఆ క్రేజీ హీరోయిన్ ఎవ‌రు… కార‌ణం ఏంటి…!

ఒక హీరో స్టార్ హీరోగా కాస్త ఫామ్ లో ఉన్నాడు అంటే హీరోయిన్లు ఆ హీరో పై ఎలాంటి పొగడ్తలు కురిపిస్తారో చెప్పాల్సిన పనిలేదు. ఆ స్టార్ హీరో పక్కన ఒక్క సినిమాలో ఛాన్స్ వస్తే తమ కెరీర్ కు చాలా ప్లస్ అవుతుందని.. తాము కూడా ఒక వెలుగు వెలగవచ్చని హీరోయిన్లు హీరోలకు సరదాగా బిస్కెట్లు వేస్తూ ఉంటారు. హీరోయిన్ చాలా సందర్భాల్లో చాలా హీరోలకు ఈ టైపు బిస్కెట్లు వేస్తూ ఉండటానికి కారణం వాళ్ళ ఫ్యాన్స్ దృష్టిలో పడడంతో పాటు ఆ హీరో నెక్స్ట్ సినిమాల్లో తనకు ఛాన్స్ ఇస్తాడన్న గేమ్ ప్లాన్ వాళ్ళ దగ్గర ఉంటుంది.

ఇటీవల ఎంతోమంది సౌత్ – నార్త్ హీరోయిన్లు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే తమకు ఎంతో ఇష్టం అని… ఎన్టీఆర్ తో ఒక్క సినిమా చేస్తే చాలు తమ జన్మ ధన్యం అయిపోతుందని బిస్కెట్లు వేయటం ప్రారంభించారు. తాజాగా అల్లు అర్జున్‌కు ఒక క్రేజీ హీరోయిన్ అలాంటి బిస్కెట్ వేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు కృతి సనన్. తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న అమ్మాయి. మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన వ‌న్ నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది.

ఆ తర్వాత నాగచైతన్య దోచేయ్ సినిమాలో కూడా న‌టించింది. ఈ రెండు సినిమాలు ఆశించినంతగా ఆకట్టుకోకపోవడంతో తెలుగులో ఆ తర్వాత ఆమెకు అవ‌కాశాలు రాలేదు. ఇక రీసెంట్ గా ఆమె నటించిన బాలీవుడ్ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ తోడేలు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కు జంటగా కృతి నటించింది. అలాగే ప్రభాస్ ఆది పురుష్‌ సినిమా తనకు నేషనల్ వైడ్‌గా మంచి బ్రేక్ ఇస్తుందన్న ఆశలతో కృతి ఉంది.

ఇక తోడేలు సినిమా ప్రమోషన్లలో కృతి రెండు తెలుగు సినిమాలు అంటే తనకు ఎంతో ఇష్టం అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా అంటే తనకు చాలా ఇష్టం అని… ఎన్టీఆర్ రామ్- చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా కూడా తనకు బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చింది. పుష్ప సినిమాను కృతి ఆకాశానికి ఎత్తేసింది.

ఇప్పుడు దేశవ్యాప్తంగా సౌత్ నుంచి నార్త్ వరకు పుష్ప 2 సినిమాపై మంచి బ‌జ్‌ ఉంది. అందుకే పుష్ప సినిమా అంటే ఇష్టం అని చెప్పిన కృతి భవిష్యత్తులో బన్నీతో కలిసి నటించిందికే ఈ స్మాల్ బిస్కెట్ వేసింద‌న్న చర్చలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి భవిష్యత్తులో బన్నీ – కృతి కలిసి నటిస్తే ఖచ్చితంగా క్రేజీ కాంబినేషన్ అవుతుంది అనడంలో సందేహం లేదు.

Latest news