Moviesit's official: బన్నీ పక్కన శ్రీలీల.. ఇక అంత రచ్చో..రచ్చస్య..రచ్చోభ్య:..!!

it’s official: బన్నీ పక్కన శ్రీలీల.. ఇక అంత రచ్చో..రచ్చస్య..రచ్చోభ్య:..!!

కన్నడ యంగ్ బ్యూటీ శ్రీలీల టైం ఓ రేంజ్ లో నడుస్తుంది. అందుకే ఒక సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టకపోయినా సరే బోలెడన్ని ఆఫర్స్ లు తన ఖాతాలో వేసుకుంది. అంతేనా రెండో సినిమా సెట్స్ పై ఉండగానే బడాబడా ఆఫర్స్ అమ్మడుకు క్యూపడుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీలీల కాల్ షీట్స్ మూడు ఏళ్లకు పూర్తిగా నిండిపోయినట్లు తెలుస్తుంది . పెళ్లి సందడ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా పరిచయమైన శ్రీలీల.. ప్రజెంట్ రవితేజ సరసన “ధమాకా” సినిమాలో నటిస్తుంది.

ఇక తర్వాత నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా, బాలయ్య -అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమా, మహేష్ – బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో అవకాశాలు దక్కించుకుంది. కాగా రీసెంట్గా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశం అందుకుంది . అల్లు అర్జున్ అనగానే పుష్ప 2 సినిమా అనుకుంటున్నారా..? కాదండి ..శ్రీ లీల- అల్లు అర్జున్ కలిసి ఒక కమర్షియల్ యాడ్లో నటించారు.

దీని తాలూకా ఫిక్స్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ యాడ్ ని డైరెక్ట్ చేసింది ఎవరో కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . దీంతో మహేష్ బాబు సినిమాలో శ్రీ లీల సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయిందని చెప్పకనే చెప్పేసాడు త్రివిక్రమ్ . ఇలా అల్లు అర్జున్ పక్కన శ్రీలీలను చూసిన జనాలు పూనకాలతో ఊగిపోతున్నారు. అంతేకాదు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాలో కూడా శ్రీలీలతో చేస్తే బాగుండని తెరపై వీరిద్దరి జంట చూడడానికి బాగుంటుందని చెప్పుకొస్తున్నారు . అయితే చూడాలి మరి అల్లు అర్జున్ శ్రీ లీల అందానికి మెచ్చి ఛాన్స్ ఇస్తాడో..లేక కన్నడ బ్యూటీ రష్మిక మందననే ఓకే చేస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news