Moviesహన్సిక పెళ్ళి చేసుకుంటే వాళ్ల బాధ‌లు ఎవ‌రు తీరుస్తారు...!

హన్సిక పెళ్ళి చేసుకుంటే వాళ్ల బాధ‌లు ఎవ‌రు తీరుస్తారు…!

గతంలో కంటే ఇటీవల హీరోయిన్స్ కొందరు పెళ్ళి విషయంలో ఆలస్యం చేయడం లేదు. అవసరమైతే సినిమాలు వదులుకొని కూడా పెళ్ళి చేసుకుంటున్నారు. కొందరు కెరీర్ నల్లేరు మీద నత్త నడక సాగుతున్నట్టుగా అవకాశాలు పెద్దగా లేకపోవడం పెళ్ళి వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు బొద్దుగుమ్మ హన్షిక మొత్వానీ కూడా ఇలాగే సరైన అవకాశాలు లేక పెళ్ళికి రెడీ అవుతోంది.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంతో పాపులర్ అయిన హన్షిక మొత్వానీ తెలుగులో దేశ ముదురు సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది. ఆమె హీరోయిన్ అయిన‌ప్పుడు ఆమె వ‌య‌స్సు కేవ‌లం 16 మాత్ర‌మే. అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంది. దాంతో హన్షిక తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా యంగ్ హీరోల సరసన సినిమాలు చేసింది. దాదాపు హన్షిక చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ హిట్ సాధించాయి.

దాంతో ఈ భామకి తమిళంలోనూ హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. తమిళ తంబీలకి హీరోయిన్ బొద్దుగా ఉంటే చాలా ఇష్టం. అలాంటి బొద్దు గుమ్మ తమిళ ఇండస్ట్రీలో హిట్స్ అందుకుంటే గుడి కూడా కట్టేస్తారు. హన్సిక కి అలా గుడి కట్టినవారున్నారు. అయితే, ఇప్పుడు అభిమానులు..హీరోలు ఏమైపోతారో అని నెటిజన్స్ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం హన్సిక మొత్వానీ పెళ్ళి చేసుకోవాలనుకోవడమే.

తమిళ్‌లో శింబు, సిద్దార్థ లాంటి కాంట్రవర్సీ హీరోలతో జతకట్టి రొమాన్స్ చేసింది. సౌత్‌లో అలాగే బాలీవుడ్‌లో ఈ బొద్దుగుమ్మ ఫిజిక్ అంటే పడి చచ్చేవారున్నారు. ఈ బ్యూటీ పెళ్ళి చేసుకుంటే వారందరి పరిస్థితేంటో అని మాట్లాడుకుంటున్నారు. నిజంగా తమ ఫేవరేట్ హీరోయిన్ పెళ్ళి చేసుకొని ఇండస్ట్రీకి దూరమైతే భరించడం కష్టమే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news