Moviesహీరోయిన్ గా ఉన్న నేను ..ఇలా మారడానికి కారణం ఆ సినిమానే.....

హీరోయిన్ గా ఉన్న నేను ..ఇలా మారడానికి కారణం ఆ సినిమానే.. నటి ప్రేమ సంచలన కామెంట్స్.!!

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. దాన్ని మరోసారి ప్రూవ్ చేసింది నటి ప్రేమ. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ వేసిన రాంగ్ స్టెప్స్ కారణంగా ..తమ సినీ కెరియర్ సగంలోనే ఆగిపోయింది . అలాగే స్టార్ హీరోయిన్ అవ్వాల్సినటువంటి ప్రేమ తను తీసుకున్న ఒకే ఒక్క చిన్న రాంగ్ స్టెప్ కారణంగా తన కెరియర్ సగంలోనే ఆగిపోయింది. నటి ప్రేమ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు .తనదైన స్టైల్ లో సినిమాలో నటించి అటు క్లాస్ ఆడియన్స్ ..ఇటు మాస్ ఆడియన్స్ ఇద్దరినీ మైమరిపించింది .

మరీ ముఖ్యంగా దేవి సినిమాలో ప్రేమ నటన అద్భుతంగా ఉంది అంటూ జనాలు మెచ్చుకున్నారు. ఆమె ను ఓ రేంజ్ లో పొగిడేసారు. అప్పట్లో ప్రేమ ఎక్కువగా డివోషనల్ కు సంబంధించిన సినిమాలో నటించిన విషయం అందరికీ తెలిసిందే . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా.. ఏ సినిమాలో నైనా సరే దేవత రోల్స్ కావాలనుకున్న అందరూ ఆమెకు తలుపులు తట్టేవారు . ఆ విధంగా తన అందంతో తన హైట్ తో జనాలను మైమరిపించేసింది. అంత అద్భుతంగా నటించేది ప్రేమ. అయితే స్టార్ హీరోయిన్గా మంచి మంచి అవకాశాలు వస్తున్న టైం లోనే ప్రేమ ఓ స్టోరీ నచ్చి ఆ సినిమాలో సైట్ క్యారెక్టర్ గా నటించింది. అంతే ఇక అప్పటినుంచి హీరోయిన్ అవకాశాలు రాకుండా పోయాయి.


ప్రేమ.. మొదటిగా విక్టరీ వెంకటేష్ నటించిన ధర్మచక్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది .ఇక తర్వాత హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో టాప్ హీరోయిన్ లిస్టులోకి దూసుకుపోయింది . సరిగ్గా అదే టైంలో చిరుగాలి సినిమాలో సైడ్ క్యారెక్టర్ పాత్రలో మెరిసింది . అంతకుముందు సినిమాలో కూడా అమ్మడు హీరోయిన్గా నటించింది. మరి ఎందుకు ఆమె ఆ సినిమాలో సైడ్ క్యారెక్టర్ ఇచ్చిందో రీసెంట్గా ఆలీతో సరదాగా షో కి వచ్చిన క్రమంలో బయటపెట్టింది.

ఆమె మాట్లాడుతూ..” చిరుగాలి సినిమా కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది .ఇప్పటికే ఆ సినిమా నేను ఎన్నో వందల సార్లు చూసి ఉంటాను. అంతేకాదు ఈ సినిమాలో నేను హీరోయిన్ పాత్ర కాదని నాకు ముందే చెప్పారు .అయినా నాకు ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది. అందుకే నేను ఆ పాత్రను చాలా ఇష్టంగా చేసాను. సినిమా కూడా మంచి హిట్ అయింది. అయితే ఈ సినిమా తర్వాత నాకు అన్ని సైడ్ క్యారెక్టర్స్ ఇచ్చారు. అదే కొంచెం బాధగా అనిపించింది .అయితే ఈ సినిమాలో ఈ పాత్ర చేసినందుకు నేను ఏమాత్రం ఫీల్ అవ్వట్లేదు .ఇప్పటికీ ఈ సినిమాలో సంతోషం సగం బలం అనే సాంగ్ నాకు చాలా బాగా ఇష్టం. ప్రతిరోజు వింటూనే ఉంటాను ఆ పాటను సరిగ్గా వింటే పాటలో ఎంత అర్థం ఉందో మీకు అర్థమవుతుంది. నన్ను హీరోయిన్గా జనాలు మర్చిపోయారు” అంటూ చెప్పుకొచ్చింది. నటి ప్రేమ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ తో రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news