Moviesఆయనకు అక్క గా జెనీలియా.. స్వయంగా ఫోన్ చేసి అడిగిన స్టార్...

ఆయనకు అక్క గా జెనీలియా.. స్వయంగా ఫోన్ చేసి అడిగిన స్టార్ హీరో..?

అందాల ముద్దుగుమ్మ జెనీలియా గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. నటనకు దగ్గరగా ఉండే పాత్రను చూస్ చేసుకుంటూ తనదైన స్టైల్ లో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జెనీలియా.. తెలుగులో బోలెడన్ని సినిమాల్లో నటించింది . కాగా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చిన చిత్రం మాత్రం బొమ్మరిల్లు. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో చూసి జెనీలియాను హ హ హాసిని అంటూ మెచ్చుకునే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు . అంతెందుకు ఈ సినిమా చూసి తమ పిల్లలకు కూడా హాసిని అన్న పేరును పెట్టుకున్న కపుల్స్ కూడా ఉన్నారు .

అంతలా తన పాత్రతో జనాల మదిని దోచేస్తుంది. కాగా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కనేసిన జెనీలియా ..రీసెంట్గా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . గాలి జనార్ధన్ కొడుకు నటిస్తున్న సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్న జెనీలియా.. రీసెంట్ గా తెలుగులో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ఓ రేంజ్ లో ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్టు ను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ..తన తర్వాతి సినిమాలో కొరటాల శివతో కమిట్ అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమా అయిపోయిన వెంటనే ప్రశాంత్ నీల్ తో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. కేజీఎఫ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా పై ఓ రేంజ్ లో ఊహించుకుంతున్నారు జనాలు . వాటికి ఏమాత్రం తీసిపోకోకుండా డబుల్ హైప్ తో ఈ సినిమాను తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమా మొత్తం అక్క సెంటిమెంట్ తో రన్ అవుతుందని.. అక్క కోసం ఎన్టీఆర్ తన కెరియర్ ని వదులుకొని.. అక్క సంతోషం కోసమే జీవించే క్యారెక్టర్లో నటించబోతున్నాడని ఓ న్యూస్ వైరల్ గా మారింది .

ఎన్టీఆర్ కి అక్కగా జెనీలియా పర్ఫెక్ట్ గా ఉంటుందని ప్రశాంత్ ఫిక్స్ అయ్యి ..ఆమెను అప్రోచ్ అవ్వగా.. జెనీలియా ఆ క్యారెక్టర్ కి ఒప్పుకోలేదట. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి జెనిలియాతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. జెనీలియా ఇదివరకే ఎన్టీఆర్ తో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన కారణంగా..ఇప్పుడు అక్క రోల్ లో నటించలేని అని తిరస్కరించినట్లు తెలుస్తుంది . జెనీలియా లాంటి హాట్ ఫిగర్ ని ఎన్టీఆర్ పక్కన హీరోయిన్గా చూడాలనుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్ ..ఈ విషయాన్ని తెలుసుకొని ప్రశాంత్ నీల్ హీరోయిన్ చూస్ చేసుకుంటే మంచిది అంటూ సజెషన్స్ ఇస్తున్నారు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news