Moviesఈ బుడ్డోడు రాబోయే కాలానికి కాబోయే హీరో.. కోట్ల ఆస్తికి వారసుడు..ఎవరో...

ఈ బుడ్డోడు రాబోయే కాలానికి కాబోయే హీరో.. కోట్ల ఆస్తికి వారసుడు..ఎవరో తెలుసా..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బుడతడి ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫోటో చూసి ఎవ్వరైనా సరే ఆ ఫోటోలో ఉన్న బాబు పోలికలతో టక్కున గుర్తుపట్టేస్తాడు. ఈ పై ఫోటోలో చూస్తున్న బాబు ఎవరో తెలుసా.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ తెలుగు రారాజు దిల్ రాజు కొడుకు. మనకు తెలిసిందే దిల్ రాజుకు ఆల్రెడీ ఓ కూతురు ఉంది. ఆమెకు పెళ్లయిపోయింది . ఆమెకు పిల్లలు ఉన్నారు.

కానీ తన మొదటి భార్య చనిపోవడంతో దిల్ రాజు కూతురు ఆయనను ఒప్పించి రెండో పెళ్లి చేయించింది . దిల్ రాజుకు ఆయన రెండో భార్యకు పుట్టిన మొదటి సంతానమే ఈ బాబు . ఫోటోలో చూడడానికి చాలా క్యూట్ గా ఉన్న ఈ బాబు కోట్ల ఆస్తికి వారసుడు. కాగా ఇన్నాళ్లు కొడుకు ఫోటో రిలీజ్ చేయని దిల్ రాజు.. ఫస్ట్ టైం తన కొడుకు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ప్రజెంట్ దిల్ రాజు నిర్మిస్తున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సినిమా వారసుడు . తమిళ్ హీరో దళపతి విజయ్ మాస్టర్ సినిమా తర్వాత తెలుగులో చేస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా లో భాగంగా విజయ్ హైదరాబాద్ కి వచ్చాడు . ఈ క్రమంలోనే దిల్ రాజు ఇంటికి స్పెషల్ గెస్ట్ గా వెళ్లి ఆయన కొడుకుతో ఆడుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . కాగా ఈ ఫోటోలు చూస్తుంటే అచ్చం దిల్ రాజు పోలికలతో ఉన్నాడు ఈ బుడ్డోడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ బుడ్డోడు రానున్న రోజుల్లో ఇండస్ట్రీని ఏలేసే హీరో అవుతాడని అంటున్నారు దిల్ రాజు ఫ్యాన్స్. చూద్దాం ఈ బాబు హీరో అవుతాడీ.. లేక నాన్న లాగే ప్రొడ్యూసర్ అవుతాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news