Moviesహైపర్ ఆది నిజంగానే గుండు కొట్టించుకున్నాడా..? అసలు అక్కడ ఏం జరిగిందో...

హైపర్ ఆది నిజంగానే గుండు కొట్టించుకున్నాడా..? అసలు అక్కడ ఏం జరిగిందో తెలిస్తే ఉమ్మేస్తారు..!!

బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలో జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ టాప్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. ఈ షోలను ఢీకొట్టడానికి పలు ఛానల్స్ సతవిధాల ప్రయత్నిస్తున్నా.. వాళ్ళ పప్పులు ఉడకడం లేదు . నెంబర్ వన్ ఎంటర్టైన్మెంట్ షో గా టిఆర్పిను బద్దలు కొడుతున్నాయి . కాగా దీనికి మెయిన్ రీజన్ ఎప్పటికప్పుడు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ సరికొత్త కంటెంట్తో జనాలను ఏదో ఒక విధంగా అట్రాక్ట్ చేయడమే కారణమని తెలుస్తుంది.

రీసెంట్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ అయింది . ఎప్పటిలాగే ఈసారి ఓ సరికొత్త కాన్సెప్ట్ తో జనాలను నవ్వించడానికి సిద్ధపడ్డారు. చదివింపులు అనే టైటిల్ తో ఈసారి శ్రీదేవి డ్రామా కంపెనీలో స్కిట్స్ వేశారు . కాగా ఎప్పటిలా కాకుండా కొంచెం వెరైటీగా ఈసారి సరికొత్త టాస్క్లను క్రియేట్ చేసింది రష్మీ. ఈ క్రమంలోనే నెంబర్స్ టాస్క్ హైలెట్గా మారింది . స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి . ఆ నెంబర్ వెనుక ఏది వస్తే అది చేయాలి . మొదటిగా హైపర్ ఆది నెంబర్ 9 చూస్ చేసుకున్నాడు .

కాగా 30 సెకండ్ల పాటు కిస్ చేయాలంటూ రాసింది . ఈ క్రమంలోనే అక్కడే ఉన్న ఐశ్వర్య వైపు గా వెళ్తాడు. అయితే ఆమె అతని ముద్దుపెట్టుకొనికుండా అటు ఇటు తిరుగుతూ టైం వేస్ట్ చేసేసింది . దీంతో సెకండ్ ఛాన్స్ కింద మరో నెంబర్ ని చూస్ చేసుకున్నాడు .. ఈ క్రమంలోని ఆదికి గుండు కొట్టించుకోవాలి అంటూ వస్తుంది. దీనితో అక్కడున్న వారంతా షాక్ అవుతారు . కొందరు కొట్టించుకోవాలి అంటుంటే మరికొందరు నో అంటారు . హైపర్ ఆది మాట వినకుండా టాస్క్ అంటే టాస్కే గుండు కొట్టాల్సిందే అంటూ స్టేజ్ పైనే గుండు కొట్టించుకోవడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతానికి ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

అయితే నిజానికి హైపర్ ఆది అక్కడ గుండు కొట్టించుకోలేదట . అక్కడ ఇన్ సైడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అదంతా ప్రోమో హైప్ కోసమే క్రియేట్ చేయబడిందని ..నిజంగా హైపర్ ఆది గుండు కొట్టించుకోలేదని ..ప్రతిసారి జనాలను మోసం చేసే విధంగానే ఈసారి ఇలాంటి టాస్క్ తో టి ఆర్ పి లు పెంచుకోవడానికి చూశారని ఓ న్యూస్ వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో ఇలాంటి చీప్ ట్రిక్స్ మరింత ఎక్కువ ప్లే చేస్తున్నారు బుల్లితెర షో లు అంటూ మండిపడుతున్నారు. మరికొందరు రెచ్చిపోయి వీళ్ల మొహానే ఉమ్మేసిన తప్పులేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news