Moviesఖైదీ నెంబ‌ర్ 150, శాత‌క‌ర్ణి సెంటిమెంట్ సేమ్ దింపేస్తోన్న చిరు, బాల‌య్య‌...!

ఖైదీ నెంబ‌ర్ 150, శాత‌క‌ర్ణి సెంటిమెంట్ సేమ్ దింపేస్తోన్న చిరు, బాల‌య్య‌…!

టాలీవుడ్‌లో 2023 బాక్సాఫీస్ ఫైట్ ఆస‌క్తిగా మారింది. ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోలు బాల‌కృష్ణ‌, చిరంజీవి న‌టిస్తోన్న వీర‌సింహారెడ్డి, వాల్తేరు వీర‌య్య రెండూ రిలీజ్ అవుతున్నాయి. అటు దిల్ రాజు నిర్మిస్తోన్న విజ‌య్ వ‌రీసు ( తెలుగులో వార‌సుడు ) సినిమా సైతం సంక్రాంతికే వ‌స్తోంది. ఇక దిల్ రాజే రిలీజ్ చేస్తోన్న మ‌రో కోలీవుడ్ హీరో అజిత్ సినిమా సైతం అదే రోజు వ‌స్తోంది. టాలీవుడ్‌లో దిల్ రాజు బ‌డా ప్రొడ్యుస‌ర్‌. నైజాంతో పాటు ఉత్త‌రాంధ్ర‌లో చాలా మంచి థియేట‌ర్లు అన్ని రాజు చేతిలో ఉన్నాయి.

అయితే వాల్తేరు వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి రెండు సినిమాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ త‌మ బ్యాన‌ర్లో వ‌స్తోన్న రెండు పెద్ద సినిమాల పంపిణీని దిల్ రాజుకు ఇవ్వ‌కుండా మైత్రీ వాళ్లు ఓన్‌గా పంపిణీ చేసుకుంటున్నారు. దీంతో రాజు సైడ్ నుంచి ఇప్ప‌టికే అన్ని ప్రాంతాల్లోనూ మంచి థియేట‌ర్లు బ్లాక్ చేయ‌డం స్టార్ట్ అయ్యింది. మెయిన్ సెంట‌ర్ల‌లో సైతం చిరు, బాల‌య్య సినిమాల కంటే విజ‌య్ సినిమాల‌కే మంచి థియేట‌ర్ల‌తో పాటు ఎక్కువ థియేట‌ర్లు దొరుకుతున్నాయంటున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు వైజాగ్‌లో వార‌సుడుకు 6, వాల్తేరు వీర‌య్య‌కు 4 థియేట‌ర్లు దొరికితే, వీర‌సింహారెడ్డికి 3 క‌న్‌ఫార్మ్ కాగా మ‌రొక‌టి లైన్లో ఉన్న‌ట్టు చెపుతున్నారు. అస‌లు త‌మిళ హీరో సినిమాకు ఇక్క‌డ స్టార్ హీరోల సినిమాల‌ను మించిన రేంజ్‌లో రిలీజ్ అంటే.. టాలీవుడ్‌లో రాజ‌కీయాలు ఎలా ఉన్నాయో తెలుస్తోంది. ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ విష‌యంలో బాల‌య్య‌, చిరు ఇద్ద‌రూ కూడా 2017లో వ‌చ్చిన ఖైదీ నెంబ‌ర్ 150, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాల సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్నారు.

అప్పుడు కూడా చిరు సినిమా ఖైదీ నెంబ‌ర్ 150.. బాల‌య్య శాత‌క‌ర్ణి కంటే ఒక రోజు ముందు రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు కూడా చిరు వాల్తేరు వీర‌య్య జ‌న‌వ‌రి 11న వ‌స్తుంటే, బాల‌య్య వీర‌సింహారెడ్డి మ‌రుస‌టి రోజు అంటే జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ రెండు సినిమాల ఫైట్ కోసం మెగా, నంద‌మూరి అభిమానులు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. మ‌రి ఈ పోరులో ఎవ‌రు పై చేయి సాధిస్తారో ? అన్న‌ది స‌స్పెన్సే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news