Moviesఆ దమ్ము ఎవ్వడికైన ఉందా రా..? బాలయ్య రాయల్ ఆన్సర్ కేకోకేక...

ఆ దమ్ము ఎవ్వడికైన ఉందా రా..? బాలయ్య రాయల్ ఆన్సర్ కేకోకేక అంతే..!!

నందమూరి నట సిం హం బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. రోజు విన్నా కానీ ఇంకా వినాలనిపిస్తుంది. చెప్పే వాళ్ళకి ఇంకా ఏదో మిగిలే ఉంది అన్న డౌట్లు వస్తాయి . అలాంటి ఓ చెరగని స్థాయిని సంపాదించుకున్నాడు నందమూరి బాలకృష్ణ . స్తండ్రి పేరు చెప్పుకొని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన బాలకృష్ణ.. ఆ తరువాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు .

ఉన్నది ఉన్నట్టు మాట్లాడే హీరోలు మన ఇండస్ట్రీలో చాలా తక్కువ. అందులో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాడు నందమూరి బాలయ్య . ఈ విషయం అందరి హీరోలకి హీరోయిన్ లకి తెలిసిన మాటే . కాగా ఎవరు ఊహించిన విధంగా హోస్ట్ గా మారిన బాలయ్య అన్ స్టాపబుల్ షో తో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంటున్నారు . బాలయ్య ఓ రేంజ్ లో యాంకరింగ్ చేస్తూ అలరిస్తున్నారు. షో కి వచ్చిన గెస్ట్ లని సరదాగా నవ్విస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే మూడో ఎపిసోడ్ కి గెస్ట్లుగా వచ్చిన యంగ్ హీరో శర్వానంద్, అడవి శేష్ ను ఓ రేంజ్ లో ఆడేసుకున్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే శర్వానంద్..” మీరు ఎంతోమంది హీరోయిన్స్ తో నటించారు కదా.. మరి మీపై ఎలాంటి రూమర్ రాలేదే..ఎందుకని” అంటూ ప్రశ్నించాడు . దీంతో బాలయ్య..” నాపై గాసిప్ రాసే దమ్ము ఎవరికైనా ఉందా..?” అంటూ తనదైన స్టైల్ లో రాయల్ ఆన్సర్ ఇచ్చాడు. దీనికి నందమూరి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు నిజానికి సినీ ఇండస్ట్రీలో గాసిప్స్ అనేటివి చాలా కామన్ అయితే బాలయ్య కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన పై ఏ గాసిప్ లు రాలేదు. ఏ హీరోయిన్ తో ఎఫైర్ అంటూ నిందలు పడలేదు. అలాంటి ఓ అన్ మార్కబుల్ రికార్డును సొంతం చేసుకున్నాడు బాలయ్య.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news