Moviesబాల‌య్య వ‌దులుకున్న టాప్ - 10 సినిమాలు ఇవే... ఇండ‌స్ట్రీ బ్లాక్‌బ‌స్ట‌ర్లు...

బాల‌య్య వ‌దులుకున్న టాప్ – 10 సినిమాలు ఇవే… ఇండ‌స్ట్రీ బ్లాక్‌బ‌స్ట‌ర్లు కూడా మిస్‌…!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాలనుకున్న కథను అనివార్య కారణాలవల్ల మరో హీరో చేసి హిట్టు కొట్టడం లేదా ప్లాప్ కొట్టడం సహజంగా జరుగుతూ ఉంటుంది. తాను వదులుకున్న సినిమా హిట్ అయితే ఆ హీరో ఫీల్ అవుతుంటాడు. అలాగే తాను రిజెక్ట్ చేసిన కథ ప్లాప్ అయితే… తన జడ్జిమెంట్ కరెక్ట్ గా ఉందని సంతోషంగా ఉంటాడు. చాలామంది స్టార్ హీరోలు ఎన్నో బ్లాక్‌బ‌స్టర్ సినిమాలు వదులుకొని తర్వాత బాధపడిన సందర్భాలు ఉన్నాయి.

ఇక దర్శకులు కూడా ముందుగా ఒక హీరోకి కథ చెప్పి ఆ తర్వాత కొందరు హీరోల చుట్టూ తిరిగి ఎవరో ఒకరితో కథ‌ ఓకే చేయించుకుని సినిమా చేసి హిట్టు కొడుతుంటారు. అయితే ఆ కథను వదులుకున్న హీరోలు సహజంగానే ఫీల్ అవుతూ ఉంటారు. నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ముందుగా తన వద్దకు వచ్చిన హిట్ సినిమాలు / ప్లాప్ సినిమాలు వదులుకొన్న‌ సందర్భాలు ఉన్నాయి అలా బాలయ్య రిజక్ట్ చేసిన కొన్ని సినిమాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

1- జాన‌కి రాముడు :
జానకి రాముడు సినిమాను ముందుగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలయ్య చేయాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల కోడి రామకృష్ణ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో బాలయ్య ఈ సినిమా చేయకూడదని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఈ సినిమా తెరకెక్కి సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాకు ముందుగా విజయశాంతిని హీరోయిన్‌గా అనుకున్నారు. హీరో మారినా నాగార్జున పక్కన కూడా విజయశాంతి నటించిన విశేషం.

2. చంటి :
తమిళంలో పీ వాసు దర్శకత్వంలో తెరికెక్కిన ఓ సినిమాను తెలుగులో బాలయ్యతో రీమేక్ చేయాలని అనుకున్నారు పరుచూరి బ్రదర్స్. బాలయ్యకు కథ కూడా చెప్పారు. బాలయ్యకు ఎందుకో ఈ కథ నచ్చలేదు. ఆ తర్వాత రాజశేఖర్ పేరు పరిశీలించారు.. అయితే చివరగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన చంటి సినిమా సూపర్ హిట్ అయింది.

3. సింహ‌రాశి :
రాజశేఖర్ కెరీర్ లో సూపర్ హిట్‌గా నిలిచి.. రాజశేఖర్ కెరీర్ టర్న్ చేసిన సింహరాశి సినిమాను దర్శకుడు సముద్ర ముందుగా బాలయ్యతో చేయాలని అనుకున్నారు. అయితే బాలయ్యకు రీమేక్‌ సినిమా చేయటం ఆ టైంలో ఇష్టం లేదు. దీంతో రాజశేఖర్ ఈ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టారు. వెంకటేష్ – మీనా హీరోగా వచ్చి సూపర్ హిట్ అయిన సూర్యవంశం సినిమా కథ‌ ముందుగా బాలయ్య దగ్గరికే వెళ్లింది. అయితే ఈ కథ అంతకుముందే తాను నటించిన పెద్దన్నయ్య కథను పోలి ఉండడంతో బాలయ్య నో చెప్పగా వెంకీ ఈ సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు.

4. శివ‌రామ‌రాజు:
హరికృష్ణ – జగపతిబాబు – శివాజీ కలిసి నటించిన శివరామరాజు సినిమాలో హరికృష్ణ పాత్రకు ముందుగా బాలయ్యను సంప్రదించారట. అయితే అప్పుడే తనకు ఇలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదని బాలయ్య తప్పుకోవడంతో హరికృష్ణకు ఆ పాత్ర దక్కింది.

5- అన్న‌వ‌రం :
పవన్ కళ్యాణ్‌ హీరోగా తమిళ రీమేక్ అయిన అన్నవరం సినిమాను ముందుగా బాలయ్యతో చేయాలని పరుచూరి బ్రదర్స్ అనుకున్నారు. అయితే ఈ లైన్ బాలయ్యకు నచ్చలేదు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా కథను తాను గతంలోనే కొన్ని సినిమాల్లో చేశానని బాలయ్య భావించడంతో ఈ కథ వదులుకున్నారు. దీంతో భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో పవన్ హీరోగా అన్నవరం సినిమా తెరకెక్కింది. అయితే అన్నవరం అంచనాలు అందుకోలేదు.

7- బాడీగార్డ్ :
విక్టరీ వెంకటేష్ హీరోగా త్రిష హీరోగా తెరకెక్కిన రీమేక్‌ సినిమా బాడీగార్డ్ ను బాలయ్యతో చేయాలని నిర్మాత బెల్లంకొండ సురేష్ అనుకున్నారు. అసలు ఈ రీమేక్‌ కథను బాలయ్య కోసమే ఆయన కొనుగోలు చేశారు. బాలయ్య తప్పుకోవడంతో చివరకు వెంకటేష్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది.

8- సైరా న‌ర‌సింహా రెడ్డి:
అస‌లు ప‌దేళ్ల క్రిత‌మే ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ రాసిన క‌థ ఆథారంగా బాల‌య్య ఈ సినిమాను చేయాలి. మ‌ధ్య‌లో ఎన్టీఆర్ పేరు కూడా వినిపించింది. చివ‌ర‌కు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సైరా వ‌చ్చింది.


9- క్రాక్ :
మ‌లినేని గోపీ డైరెక్ష‌న్‌లో ర‌వితేజ హీరోగా చేసిన క్రాక్ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. బాల‌య్య‌కు రొటీన్ మాస్ యాక్ష‌న్ క‌థ‌లు చాలా చేసి ఉండ‌డంతో క్రాక్ న‌చ్చ‌లేదు. చివ‌ర‌కు ర‌వితేజ ఈ సినిమా చేశాడు.

10- సింహాద్రి :
రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన సింహాద్రి క‌థ ముందుగా బాల‌య్య ద‌గ్గ‌ర‌కే వెళ్లింది. బాల‌య్య హీరోగా బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో చేయాల‌ని విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ అనుకున్నారు. అప్పుడు బాల‌య్య ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు సినిమా చేస్తుండ‌డంతో ఇది వ‌దులుకున్నారు. చివ‌ర‌కు ఈ సినిమా ఎన్టీఆర్ చేసి సూప‌ర్ హిట్ కొట్టారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news