Moviesఆ హీరోయిన్ వల్లే అర్చన ప్రేమించిన వ్యక్తితో బ్రేకప్ అయ్యిందా..!

ఆ హీరోయిన్ వల్లే అర్చన ప్రేమించిన వ్యక్తితో బ్రేకప్ అయ్యిందా..!

చాల మంది హీరోయిన్స్ అంటే బాడీ ఎక్సపోజ్ చేయాల్సిందే అని అనుకుంటారు. ఆలా చేస్తేనే ఎక్కువ రోజులు ఇండస్ట్రీ లో రాణిస్తారు అనే నమ్ముతూ ఈ మధ్య మరి ఎక్స్‌పోసింగ్ విషయంలో హద్దులు పెట్టుకోకుండా నటిస్తున్నారు. కేవలం సినిమాల్లోనే కాదు. మాములు ఫోటోషూట్స్ కోసం, లేదా ఏదైనా పార్టీ లకు, ఫంక్షన్ల‌కు వచ్చిన కూడా అదే పద్ధతిలో ఉంటున్నారు. కానీ అది పూర్తిగా అనవసరం అనే చెప్పాలి. కొన్నేళ్ల క్రితం సినిమాల్లో ఇంత హద్దులు మీరిన శృంగారం వొలకబోసేవారు కాదు. అయినా కూడా అప్పటి హీరోయిన్స్ ని ఇప్పటికి గుర్తు చేసుకుంటూనే ఉంటారు. వారు ఇండస్ట్రీలో లేకపోయినా సరే వారి గురించి ఏదో ఒక వార్త కనిపిస్తూనే ఉంటుంది.

ఆలా నాటి రోజుల్లో బాగా కనిపించిన, నటించిన హీరోయిన్ అర్చన. ఆమె తెలుగు అమ్మాయి అయినా కూడా హిందీ సినిమాతో చిత్ర రంగ ప్రవేశం చేసింది. యాడూన్ కే బరాత్ ఆమె మొట్ట మొదటి చిత్రం. ఆ తర్వాత ఒకటి అరా తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన ఆమె నటించిన నిరీక్షణ సినిమా ద్వారానే చాల పాపులర్ నటిగా మారిపోయింది. ఈ సినిమాలో భాను చందర్ హీరోగా నటిస్తే అయన పక్కన జాకెట్ కూడా వేసుకోకుండా పల్లెటూరి అమ్మాయి పాత్రలో అర్చన నటించింది.

ఈ సినిమా కోసం ఎంతో మంది హీరోయిన్స్ ని చూసినప్పటికీ బాలు మహేంద్రకు అర్చన బాగా నచ్చింది. ఈ సినిమా ద్వారా నంది అవార్డు కూడా అందుకుంది. ఇక అక్కడ నుంచి మొదలైన ఆమె సినీ ప్రస్థానం తమిళ్ లో, తెలుగులో చాల రోజుల పాటు సాగింది. నటించింది తక్కువ సినిమాలే అయినా ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే అర్చన చేసేది. ఆ తర్వాత తెలుగు లేడీస్ టైలర్ సినిమా కూడా అర్చనకు మంచి పేరును తీసుకచ్చింది.

ఇక మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఆమె మంచి సినిమాలే చేసింది. ఆమె చేసిన దాసీ సినిమా కూడా అర్చనకు మంచి పేరు తీసుకచ్చింది. ఇక ఆమె కెరీర్ లో రెండు సంవత్సరాలు వ‌రుస‌గా ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఇంగ్లీష్ లో కూడా ఒక సినిమా చేసింది అర్చన. ఇక అర్చన వ్యక్తి గత జీవితం విషయానికి వస్తే ఒక రకంగా ఆమెకు సినిమా ఇండస్ట్రీలో బాలు మహేంద్ర గురువు లాంటి వ్యక్తి. అయితే ఆమె బాలు మహేంద్ర తో కొన్నాళ్ళు ప్రేమలో ఉంది అనే వార్తలు అప్పట్లో బలంగా వినిపించాయి.

కానీ బాలు మహేంద్ర కి అప్పటికే పెళ్ళయ్యి ఒక కొడుకు ఉన్నాడు. అయినా కూడా అతడు నటి శోభను ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆమె ఆత్మహత్య చేసుకొని కన్ను మూసింది. అయితే శోభా మరణానికి కారణం బాలు మహేంద్ర అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అర్చన తో ప్రేమలో పడిన, బాలు మహేంద్ర నటి మౌనికతో కూడా ప్రేమలో పడ్డాడు. మౌనిక బాలు మహేంద్రను పిచ్చి పిచ్చి గా ప్రేమించడంతో అర్చనతో బాలు మహేంద్ర బంధం ముగిసిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news