Moviesఅనూ ఇమ్మానియేల్‌తో బ‌ల‌వంతంగా ఆ ప‌ని చేయించారా... !

అనూ ఇమ్మానియేల్‌తో బ‌ల‌వంతంగా ఆ ప‌ని చేయించారా… !

అనూ ఇమ్మానియేల్ తప్పక ముద్దులు పెట్టాల్సివచ్చిందా..? అంటూ తాజాగా సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి కారణం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఊర్వశివో రాక్షసివో సినిమా. తెలుగులో నేచురల్ స్టార్‌గా పాపులర్ అయిన నాని సరసన మజ్ఞు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో అనూ ఇమ్మానియేల్ పర్ఫార్మెన్స్ అందరినీ బాగా ఆకట్టుకుంది. ఆ కారణంగానే మొదటి సినిమా యావరేజ్ అయినా కూడా అనూకి అవకాశాలు వచ్చాయి.

చెప్పాలంటే కెరీర్ ప్రారంభంలో అనూకి ఆశించినంతగా సక్సెస్‌లు దక్కలేదు. యంగ్ హీరో రాజ్ తరుణ్ సరసన నటించిన కిట్టూ ఉన్నాడు జాగ్రత్త సినిమా ఫ్లాప్‌గానే మిగిలింది. దీని తర్వాత ఆక్సిజన్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో గోపీచంద్ హీరో. ఇందులో కూడా అనూ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అయితే ఈ మూవీ కూడా డిజాస్టర్ కావడంతో అయ్యో అనూ కెరీర్ ఎలా ? అనుకున్నారు.

లక్కీగా గురూజీ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ఛాన్స్ ఇచ్చాడు. కీర్తి సురేష్ ఓ హీరోయిన్‌గా నటించినా కూడా అనూకి మంచి రోల్ దక్కింది. పవన్ కళ్యాణ్ హీరో అయినా ఆ సినిమా డిజాస్టర్. ఇలా అనూ ఇమ్మానియేల్ నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. శైలాజారెడ్డి అల్లుడు, మహా సముద్రం, అల్లుడు అదుర్స్ ఇలా అన్ని ఫ్లాపులే. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అనూ కెరీర్‌లో ఒక్కటంటే ఒక్క హిట్ లేకపోవడం.

అయినా కూడా అల్లూ కాంపౌండ్‌లో అడుగుపెట్టి సినిమా చేసింది. అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ఊర్వశివో రాక్షసివో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అల్లు అర్జున్ సరసన నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కూడా ఫ్లాపైంది. ఇందులో రొమాన్స్ అంటూ చేసింది లేదు. కానీ, తాజా చిత్రమే చివరిది అనుకుందేమో గానీ, పెదవి ముద్దులతో రెచ్చిపోయింది. రొమాన్స్‌లో పీక్స్. ఇదే ఇప్పుడు అనూ కెరీర్‌ని మలుపు తిప్పుతుందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news