Moviesవాణిశ్రీ చేసిన ప‌నికి కోపంతో ర‌గిలిపోయి... టార్గెట్ చేసిన విజ‌య‌నిర్మ‌ల‌...!

వాణిశ్రీ చేసిన ప‌నికి కోపంతో ర‌గిలిపోయి… టార్గెట్ చేసిన విజ‌య‌నిర్మ‌ల‌…!

స్టార్ హీరోల మధ్య స్టార్ హీరోయిన్ల మధ్య ఇగోలు, పంతాలు పట్టింపులు ఈనాటివి కావు.. గత కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నవే. అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న శారద, వాణిశ్రీ, సావిత్రి, బి. సరోజ, విజయనిర్మల, షావుకారు జానకి, కృష్ణకుమారి ఇలా చాలామంది మధ్య ఈ తరహా విభేదాలు కొనసాగేవి. అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణకు జోడిగా ఎంతోమంది హీరోయిన్లు నటించారు. విజయనిర్మల అటు పద్మాలయ బ్యానర్ లోను ఇటు సొంత బ్యాన‌ర్‌ అయిన విజయ‌కృష్ణ బ్యానర్ లోను కృష్ణ హీరోగా ఎక్కువ సినిమాలు నిర్మించారు.

కృష్ణ – జయప్రద సన్నిహితంగా ఉండటం విజయనిర్మలకు నచ్చేది కాదని అంటారు. కృష్ణ – జయప్రద కాంబినేషన్లో ఎక్కువ సినిమాలు రావటం ఆ సినిమాల‌ షూటింగ్ సమయంలో వారి ఇద్దరు సన్నిహితంగా ఉండటం విజయనిర్మలకు నచ్చక పోవడంతోనే జయప్రద అంటే ఆమెకు గిట్టేది కాదని అంటారు. అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా ఉండడంతో పాటు కృష్ణతో ఎక్కువ సినిమాల్లో నటించిన మరో హీరోయిన్ వాణిశ్రీ తోను ఒక విషయంలో విజయనిర్మలకు తీవ్రమైన మనస్పర్ధలు వచ్చాయి. చివరకు విజయనిర్మల వాణిశ్రీ పై పంతం వేసి మరి టార్గెట్ చేసే వరకు వచ్చేసింది.

దివంగత లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు కెరియర్‌లో దేవదాసు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. అయితే ఇటు కృష్ణకు… అటు విజయనిర్మలకు దేవదాసు పార్వతి పాత్రల్లో నటించాలన్న కోరిక ఎప్పటినుంచో బలంగా ఉండేది. అందుకే దేవదాసు సినిమాను తిరిగి నిర్మించడంతో పాటు అందులో విజయనిర్మల పార్వతి పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా రిలీజ్ టైంలోనే ఏఎన్నార్ పట్టుబట్టి తన పాత దేవదాసు కూడా రీరిలీజ్ చేయించారు.

 

ఏఎన్ఆర్ దేవదాసు ముందు కృష్ణ దేవదాసు పూర్తిగా తేలిపోయింది.. ఎవరు పట్టించుకోలేదు. విచిత్రం ఏంటంటే రీ రిలీజ్ చేసిన ఏఎన్ఆర్ దేవదాసు వంద రోజులు ఆడితే కృష్ణ దేవదాసు 50 రోజులకే పరిమితం అయింది. అదే సమయంలో ప్రపంచ తెలుగు మహాసభల కోసం తెలుగు నటీనటులు అందరూ ప్రముఖ నగరాల్లో నాటకాలు వేసి విరాళాలు సమకూర్చారు. నెల్లూరులో రక్త కన్నీరు నాటకం ఆడుతున్న వాణిశ్రీ నెల్లూరు నగరంలో ప్రస్తుతం ఏం ? సినిమాలు ఆడుతున్నాయి. ఏఎన్ఆర్ గారి దేవదాసు ఆడుతుందిగా ఆ సినిమా చాలా బాగుంటుంది… వెళదామా అంటూ కాకతాళీయంగా నాటకంలో ఓ డైలాగును అప్పుడున్న సినిమాలకు అన్వయించి చెప్పారు. అయితే అదే సమయంలో మరో థియేటర్లో కృష్ణ దేవదాసు సినిమా కూడా ఆడుతోంది.

ఎన్టీఆర్ తో వాణిశ్రీ నటించిన సినిమా కూడా అప్పుడు థియేటర్లలో ఉంది. కానీ వాణిశ్రీ అటు తన సినిమా.. అటు కృష్ణ దేవ‌దాసు గురించి చెప్పకుండా ఏఎన్ఆర్ దేవదాసు గురించి ప్రస్తావించడం విజయనిర్మలకు తీవ్ర ఆగ్రహం రావడానికి కారణమైంది. అప్పటికే ఏఎన్ఆర్ దేవదాసు రీ రిలీజ్ చేయడంతో కృష్ణ దేవదాసు థియేటర్లలో నడిచేందుకు అష్ట కష్టాలు పడుతోంది. అదే సమయంలో వాణిశ్రీ ఏఎన్ఆర్ దేవదాసు సినిమాకు వెళదాం అని ప్రస్తావించడం ద్వారా కావాలని తమ సినిమాకు మైనస్ అయ్యేలా కార్నర్ చేస్తూ మాట్లాడారని విజయనిర్మలలో ఆక్రోషం కట్టలు తెంచుకుంది.

దీంతో ఆమె నేరుగా వాణిశ్రీ కి ఫోన్ చేసి నీపై కంప్లైంట్ చేస్తున్నాను అని చెప్పాటం.. అక్కడితో ఆగని విజయనిర్మల వాణిశ్రీపై అప్పుడు తెలుగు సినిమా రంగానికి పెద్దదిక్కుగా ఉన్న గుమ్మడికి ఫిర్యాదు చేశారు. గుమ్మడి వాణిశ్రీ నుంచి సంజాయిషి కూడా కోరార‌ట. అయితే వివాదం పెద్దదిగా మారడంతో చివరకు మరో నటుడు జగ్గయ్య రంగంలోకి దిగి ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిచే ప్రయత్నం చేశారట. అయితే వాణిశ్రీ తాను కావాలని అలా మాట్లాడలేదని చెప్పడంతో పాటు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారట. ఆ తర్వాత వాణిశ్రీ- కృష్ణ సినిమాల్లో నటించలేదని.. అయినా అది వాణిశ్రీ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపించలేదని అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news