Moviesకాబోయే భ‌ర్త‌తో హ‌న్సిక ప‌ర్స‌న‌ల్ ఫొటో లీక్‌.. నాలిక బ‌య‌ట పెట్టి...

కాబోయే భ‌ర్త‌తో హ‌న్సిక ప‌ర్స‌న‌ల్ ఫొటో లీక్‌.. నాలిక బ‌య‌ట పెట్టి మ‌రీ…!

యాపిల్ బ్యూటీ హ‌న్సిక త్వ‌ర‌లోనే వివాహ బంధంలోకి అడుగు పెడుతోంది. ఆమె జీవితంలో ఇప్ప‌టికే చాలా ప్రేమ‌లు చూసేశాం. కోలీవుడ్ యంగ్ హీరో శింబు, ఆ త‌ర్వాత జ‌యం ర‌వి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే, హీరో ఉద‌య‌నిధి స్టాలిన్‌తో ఆమె ప్రేమాయ‌ణం న‌డిపింద‌న్న వార్త‌లు తెలిసిందే. అయితే ఎట్ట‌కేల‌కు ఆమె స్నేహితుడు సోహైల్ క‌టూరియాను పెళ్ల‌డ‌నుంది. వ‌చ్చే నెల‌లోనే వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంది. వీరిద్ద‌రు మంచి స్నేహితులు మాత్ర‌మే కాకుండా… వ్యాపార భాగ‌స్వాములు కూడా..!

మ‌రో ట్విస్ట్ ఏంటంటే త‌న స్నేహితురాలి మాజీ భ‌ర్త అయిన సోహైల్‌తోనే ఆమె ప్రేమ‌లో ప‌డ‌డం.. పెళ్లి చేసుకోవ‌డం. డిసెంబ‌ర్ 2 నుంచి వీరి వివాహ వేడుక‌లు ప్రారంభం కానున్నాయి. 4న రాజ‌స్థాన్‌లోని ఓ పురాత‌న ప్యాలెస్‌లో వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలోనే హ‌న్సిక‌కు కాబోయే భ‌ర్త‌తో ఆమె ఉన్న ఓ ప‌ర్స‌న‌ల్ ఫొటో వైర‌ల్ అవుతోంది.

ఈ ఫొటోలో ఆమె నాలిక బ‌య‌ట పెడుతూ త‌నకు కాబోయే భ‌ర్త‌కు ముద్దు ఇచ్చేందుకు ట్రై చేస్తున్న‌ట్టుగా ఉంది. బోట్‌లో స‌ర‌దాగా షికార్లు కొడుతోన్న క్ర‌మంలో ఈ ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. హ‌న్సిక అఫీషీయ‌ల్ అన్న ఇన్‌స్టా అక్కౌంట్ నుంచి ఈ ఫొటో బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఈ ఫొటో వైర‌ల్ అవుతుండ‌డంతో హ‌న్సిక స్పందించింది. ఇది త‌న అక్కౌంట్ కాద‌ని.. ఫేక్ అని.. ఇది మార్పింగ్ లేదా ఎడిట్ చేసిన ఫొటో అయ్యి ఉండొచ్చ‌న్న సందేహం హ‌న్సిక వ్య‌క్తం చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news