Moviesచేతిలో పాల గ్లాసు..తల్లో మెల్లె పూలు..పుష్ప 2 కోసం హాట్ ఐటెం...

చేతిలో పాల గ్లాసు..తల్లో మెల్లె పూలు..పుష్ప 2 కోసం హాట్ ఐటెం బాంబ్ రెడీ..!?

సినిమాలు ఎవరైనా తెరకెక్కిస్తారు.. కానీ జనాల నాడి పట్టుకొని వాళ్లకు నచ్చే విధంగా తెరకెక్కించడం కేవలం సుకుమార్ కే సాధ్యమని చెప్పాలి. సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ కి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు ఆయన తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది . అంతే కాదు ఎన్నో రికార్డును కొల్లగొట్టింది . ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్గా సుకుమార్ సంచలన రికార్డు క్రియేట్ చేశాడు . మరీ ముఖ్యంగా సుకుమార్ అల్లు అర్జున్ తో కలిసి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించాడు.

రీసెంట్గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న సుకుమార్ త్వరలోనే పుష్ప 2 సినిమా షూటింగ్ ని ప్రారంభించబోతున్నాడు . ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నటులను చూస్ చేసుకునే పని పూర్తి చేసుకున్న సుకుమార్ ..ప్రజెంట్ ఈ సినిమాలో ఐటెం సాంగ్ పై కాన్సన్ట్రేషన్ చేసినట్లు తెలుస్తుంది. మనకు తెలిసిందే సుకుమార్ సినిమా అంటే కచ్చితంగా బ్లాక్ బస్టర్ ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమాల్లో ఐటెం సాంగ్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది .

100% లవ్ లో డియాలో డియాలా.. రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి ..పుష్ప సినిమాలో ఊ అంటావా మావా.. ఇలా తనకంటూ స్పెషల్ డైరెక్షన్ ఫాలో అవుతూ సుకుమార్ డైరెక్ట్ చేస్తాడు . కాగా పుష్ప 2 సినిమా కోసం సుకుమార్ మిల్కీ బ్యూటీ తమన్నా ఐటం బాంబుగా రెడీ చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తుంది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ క్రమంలోనే DSP అదిరిపోయే ట్యూన్ కట్టినట్టు తెలుస్తుంది .

ఈ సాంగ్ మొత్తం తల్లో మల్లెపూలు.. చేతిలో పాల గ్లాసు అనే పదాలతో కుర్రాలను ఉప్పు ఊపించడానికి సిద్ధపడినట్లు సోషల్ మీడియాలో వార్తలు ఆధారంగా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే పార్ట్ వన్ తో ఉ అంటావా మావ ఊ ఊ అంటావా మావ అనిపించిన సుకుమార్ పార్ట్ 2 తో పాల గ్లాసుతో క్రేజీ హిట్ను అందుకోవడానికి సిద్ధపడ్డాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి . మరి చూడాలి ఈ చేతిలో గ్లాసు తలలో మల్లెపూలు పాట ఎలాంటి హిట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news