Moviesఅల్లా కోసం అలాంటి పని..నటి సంచలన నిర్ణయం..!?

అల్లా కోసం అలాంటి పని..నటి సంచలన నిర్ణయం..!?

ప్రముఖ భోజ్ పూరి నటి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇకపై తను నటనను కొనసాగించను అని ..ఇస్లాం మతమార్గాన్ని అనుసరించడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పి అభిమానులకు గుండెలు బద్దలు కొట్టింది. భోజ్ పూరి నటి సహర్ అఫ్ష..గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన తెలుగు వాళ్లకి పెద్దగా ఈ పేరు తెలియనప్పటికీ సోషల్ మీడియా రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి అమ్ముడు పేరు బాగా తెలుసు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఇకపై నటనకు దూరంగా ఉండడానికి నిర్ణయించుకుంది.

 

ఇస్లాం మతమార్గాన్ని అనుసరించడానికి ఆమె షోబిజ్ పరిశ్రమ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా ఆమె ప్రకటించింది. దీంతో అటు భోజ్ పురి ఇండస్ట్రీలో..ఇటు సోషల్ మీడియాలో ఈ న్యూస్ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. సోషల్ మీడియా వేదికగా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అభిమానులకు తెలియజేస్తూ..షాకింగ్ ప్రకటన చేసింది. దీంతో అభిమానులు డిసప్పాయింట్ అవుతున్నారు.

“ప్రియమైన సోదర సోదరీమణులారా.. అత్యంత దయామయుడైన మా అల్లా కోసం నేను షోబీజ్ ను విడిచిపెడుతున్నాను. ఈ విషయం మీకు చెప్పడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాను . ఇకపై నేను వినోద పరిశ్రమలో భాగం కాబోను. భవిష్యత్తులో ఇస్లామిక్ బోధనలకు అనుగుణంగా ఆశీర్వాదాలతో జీవించాలి అనుకుంటున్నాను . ఇన్నాళ్లు నాపై మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు “అంటూ ఓ నోట్ రాసుకొచ్చింది. ప్రజెంట్ ఆమె తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా కొనసాగుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news