Moviesమ‌ర‌ద‌లికి ఒక్క ఛాన్స్ అంటూ స్టార్ హీరో క‌ష్టాలు... 35 ఏళ్ల...

మ‌ర‌ద‌లికి ఒక్క ఛాన్స్ అంటూ స్టార్ హీరో క‌ష్టాలు… 35 ఏళ్ల వ‌య‌స్సులో ముదురు హీరోయిన్ బాధ‌లు..!

బేబీ షామిలి.. క్యూట్ క్యూట్ అందాలతో చిన్న తనంలోనే నటిగా మారింది. నిజానికి బేబీ షామిలి తండ్రికి నటన అంటే ఎంతో ఇష్టం. హీరో అవ్వాలని మద్రాసుకు మకాం మార్చిన అవి ఫలించకపోయినా తన ముగ్గురు పిల్లలు షామిలి, షాలిని, రిషిలను చైల్డ్ ఆర్టిస్ట్ లు.. ఆ తర్వాత లేదా యాక్టర్స్ నటించడంతో అయన కోరిక నెరవేరింది. రిషి హీరో అవ్వకపోయిన తెలుగులో అడపా దడపా నటిస్తూ తమిళ్ లో కొన్ని సినిమాల్లో హీరోగా చేసాడు. ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి సైడ్ అయ్యాడు. షాలిని మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ కన్నా కూడా హీరోయిన్ గా ఎక్కువ క్రేజ్ దక్కించుకుంది. తర్వాత తమిళ స్టార్ హీరో అజిత్ తో ప్రేమలో పడి సినిమా లకు గుడ్ బై చెప్పి ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

షాలినికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. షాలిని కుమార్తె ప్రస్తుతం టీనేజ్ లో ఉంది. తన తల్లి కన్నా ఎంతో అందంగా ఉన్న షాలిని కుమార్తెను చూస్తే త్వరలో హీరోయిన్ అయినా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎటొచ్చి చైల్డ్ ఆర్టిస్ట్ షామిలి పరిస్థితి రెండికి చెడ్డ రేవడిగా మారింది. చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా యమ బిజీగా గడిపింది. హీరోయిన్ అయ్యే టైం కి ఆమె చాల బొద్దుగా ఉండటంతో ఫస్ట్ లుక్ లోనే మైనస్ మార్కులు వేయించుకుంది.

హీరోయిన్ గా తెలుగులో సిద్దార్థ్ సరసన ఓయ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత మళ్లి అవకాశాలు దక్కించుకోలేకపోయింది. ఇక మలయాళంలో ఓ సినిమాలో చిన్న రోల్ లో నటించినా అది కూడా షామిలి కి పెద్ద వర్క్ అవుట్ అవ్వలేదు. తర్వాత తమిళ్ లో విక్రమ్ ప్రభు సరసన వీర శివాజీ సినిమాలో మెయిన్ లీడ్ గా చేసిన షామిలిని చుసిన వారే లేరు. మళ్లీ అమ్మమ్మ గారిల్లు సినిమాతో తెలుగు తళుక్కుమన్న ఈ సినిమా ఫ్లాప్ కావడం తో అమ్మడు ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. ఇప్పటికే 35 ఏళ్ళ వయసు వచ్చిన ఒక్క హిట్టు సినిమాలోనూ నటించకపోవడంతో దాదాపు కెరీర్ ముగిసే పరిస్థితి వచ్చింది.

మొదటి సినిమా ఫ్లాప్ అయినా టైంలో బాడీ ని మేకోవర్ చేసి కమర్షియల్ హీరోయిన్ అవ్వాలని కలలు కన్నప్పటికీ అది కూడా సాధ్యం కాలేదు. ఇక చాల మంది హీరోయిన్లు 15 ఏళ్లకే ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి 30 లలోకి వెళ్లే సరికి రిటైర్మెంట్ తీసుకొని తనకు తగ్గ జోడీని చూసుకొని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ నుంచి సైడ్ అవుతున్నారు. షామిలి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది మూడు పదులు దాటినా వయసులో ఎవరో ఒకరు అవకాశం ఇవ్వకపోతారా ? అని ఎదురు చూస్తూ ఉంది.

 

చివరికి షామిలి బావ అజిత్ కూడా ఆమెకు అవకాశాలు ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్న అది కూడా ఎలాంటి ఫలితం ఇవ్వడం లేదు. మరి సినిమాలు ఎటు లేవు కాబట్టి పెళ్లి చేసుకొని అయినా ఒక ఇంటి ఇల్లాలు అయితే బాగుంటుంద‌ని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఇంకా వయసు దాటితే సినిమాల సంగతి దేవుడు ఎరుగు సరైన భర్త కూడా రాడు ఏంది ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్న మాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news