Moviesఅమ్మాయిలు క‌నిపిస్తే సైలెన్స‌ర్ పీకేసి... నీకంటే రొమాంటిక్‌... బాల‌య్య‌తో బాబు ప్రోమో...

అమ్మాయిలు క‌నిపిస్తే సైలెన్స‌ర్ పీకేసి… నీకంటే రొమాంటిక్‌… బాల‌య్య‌తో బాబు ప్రోమో అదుర్స్ (వీడియో)

తెలుగు బుల్లితెర‌పై వ‌చ్చిన టాక్ షోల‌ను తోసిరాజ‌ని స‌రికొత్త టాక్ షోతో స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు బాల‌య్య‌. బాల‌య్య హోస్ట్ చేసిన ఆహా వారి అన్‌స్టాప‌బుల్ షో ఫ‌స్ట్ సీజ‌న్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చూశాం. ఇప్పుడు సీజ‌న్ 1కు కొన‌సాగింపుగా సీజ‌న్ 2 రెడీ అవుతోంది. ఇప్ప‌టికే రెండు ఎపిసోడ్ల షూటింగ్ కూడా పూర్త‌య్యింది. ఫ‌స్ట్ ఎపిసోడ్‌తోనే బాల‌య్య పెద్ద సంచ‌ల‌నం రేపేందుకు రెడీ అవుతున్నాడు. బాల‌య్య వియ్యంకుడు, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో పాటు బాల‌య్య అల్లుడు లోకేష్‌తో ఫ‌స్ట్ ఎపిసోడ్ రాబోతోంది.

ఈ నెల 14న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్ సంచ‌ల‌నం రేపుతూ సోష‌ల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇక రెండో ఎపిసోడ్‌లో టాలీవుడ్ క్రేజీ హీరోలు విశ్వ‌క్‌సేన్‌, జొన్న‌ల‌గ‌డ్డ సిద్ధు క‌లిసి బాల‌య్య ముందు కూర్చోనున్నారు. ఈ ఎపిసోడ్ కూడా ఇప్ప‌టికే షూట్ పూర్త‌య్యింది. ఇక ఫ‌స్ట్ ఎపిసోడ్ టోట‌ల్ సీజ‌న్‌కే క్రేజీ ఎపిసోడ్ కానుంది.

ఈ ఎపిసోడ్ ప్రోమోను ఈ రోజు క‌ట్ చేశారు. 5.31 నిమిషాల పాటు ఉన్న ప్రోమో అదిరిపోయింది. బాల‌య్య ఫ‌స్ట్ డైలాగ్‌గా మొద‌టి ఎపిసోడ్లో నా బంధువుల‌ను పిలుద్దామ‌ని అనుకున్నా… మీకు బాబు గారు.. నాకు బావ గారు శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు గారు అంటూ ఆయ‌న్ను ఆహ్వానించారు. మీ లైఫ్‌లో మీరు చేసిన రొమాంటిక్ పనేంట‌ని బాల‌య్య అడిగితే.. మీ కంటే ఎక్కువే చేశాను.. మీరు సినిమాల్లో చేస్తే.. నేనే స్టూడెంట్‌గా చేశాన‌ని బాబు చెప్పిన డైలాగ్ హైలెట్‌. ఈ టోట‌ల్ ప్రోమోను మీరు కూడా చూసేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news