Moviesఆ విషయంలో ఈ ముగ్గురు హీరోలు అన్ లక్కినే తెలుసా..!?

ఆ విషయంలో ఈ ముగ్గురు హీరోలు అన్ లక్కినే తెలుసా..!?

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయాలోకం . రంగుల ప్రపంచం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ట్ చేయలేరు. అలాంటి మాయలో పడే తెలుగు హీరోలు రానా, నాని, నరామ్ బోల్తా కొడుతున్నారు. ఈ ముగ్గురు హీరోలకి తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలు కాకపోయినా కానీ టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్నారు. అయితే వీళ్ళు ఎన్ని హిట్ సినిమాలు కొడుతున్న ఇంకా స్టార్ స్టేటస్ సంపాదించుకోవడానికి కారణం వాళ్ళ దురదృష్టమని తెలుస్తుంది.

రీసెంట్గా అలాంటి దురదృష్టమే ఒకటి వీళ్లని అదృష్టంలా వెంటాడింది. దీంతో మరోసారి మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నారు రానా ,నాని, రామ్. మనకు తెలిసిందే అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ డైరెక్టర్ చేసిన మూవీ “ది ఘోస్ట్”..దసరా కానుకగా నేడు ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. నిజానికి నాగార్జున కెరియర్ లో ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఫస్ట్ సినిమా ఇదే. దీంతో అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే నిజానికి ఈ సినిమాను ప్రవీణ్ సత్తార్ ముందు చెప్పింది రానా దగ్గుబాటి. రానా కోసం ఈ కథను ప్రవీణ్ సత్తార్ ప్రిపేర్ చేసుకొని ఆయనకు చెప్పారట.

అయితే రానా తన బాడీకి ఈ కధ సెట్ అవ్వదు అంటూ రిజక్ట్ చేశారట. ఇక తర్వాత యంగ్ హీరో రామ్కి చెప్పారట. అప్పటికే రామ్ “ది వారియర్”.. బోయపాటితో మరో సినిమా కమిట్ అయ్యి ఉండడంతో ..ఈ కథను రిజెక్ట్ చేశాడట . ఇక తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ కథను నాచురల్ స్టార్ నానికి చెప్పారట . అయితే నాచురల్ స్టార్ నాని కూడా రానాలాగే మీరు రాసుకున్న స్క్రిప్ట్ కి నా బాడీ సెట్ అవ్వదు ప్రజెంట్ దసరా కోసం బాడీ లుక్స్ మార్చేస్తున్నాను అంటూ స్కిప్ చేశారట . దీంతో ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ గా సీనియర్ హీరోలపై కన్ను వేసి నాగార్జున దగ్గరికి వెళ్లి స్టోరీ చెప్పారట . స్పాట్ లోనే నాగార్జున అగ్రిమెంట్ పేపర్స్ తెప్పించే సైన్ చేయడం ఆ తర్వాత చకచక షూటింగ్ కంప్లీట్ చేసి ఫినిష్ చేసి థియేటర్లో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కూడా కొట్టేశాడు. దీంతో కోరి వచ్చిన అదృష్ట దేవతను వద్దనుకొని ఈ హీరోలు తప్పు చేసారు అంటూ ఈ హీరోలను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నరు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news