Moviesబన్నీ భార్యకు-ఎన్టీఆర్ భార్యకు మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా..?

బన్నీ భార్యకు-ఎన్టీఆర్ భార్యకు మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సినీ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఏ విషయమైనా సరే ఇట్టే వైరల్ గా మారిపోతున్నాయి. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కాస్ట్యూమ్స్ , బ్రాండెడ్ ఐటమ్స్, వాళ్ళు వాడే ప్రొడక్ట్స్.. ఓ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వస్తున్నాయి . ఈ క్రమంలోనే స్టార్ హీరోల భార్యలు కూడా పాపులర్ అయిపోతున్నారు . మరీ ముఖ్యంగా ఆ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి.

స్టార్ హీరోయిన్స్ కి మించిపోయే అందం ఉన్న బన్నీ భార్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హెల్తీగా ఆరోగ్యకరంగా హెల్త్ ని మైంటైన్ చేసుకుంటూ వస్తుంది . కాగా బన్నీ భార్య కూడా హీరోయిన్స్ లాగా ఎప్పటికప్పుడు ట్రెండీ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది . అయితే అందరి స్టార్ హీరోల భార్యకి బన్నీ భార్యకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బన్నీ భార్య హీరోయిన్స్ కి ధీటుగా కాస్ట్యూమ్‌స్ సెలెక్ట్ చేసుకుంటుంది . ఈమె స్టైలిస్ట్ ఎవరో కాదు ప్రీతమ్ జువ్వాల్కర్. అదేనండి సమంతతో గతంలో నానా రచ్చ చేశారే అతడే బన్నీ భార్య కాస్ట్యూమ్ డిజైనర్.

అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ పోల్ వైరల్ గా మారింది . బన్నీ భార్యకు టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ భార్యకు మధ్య తేడాలు ఇవే అంటూ న్యూస్ లు హరిచల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మోడ్రన్ మహాలక్ష్మి గా బన్నీ భార్యను.. తెలుగు ఇంటి కుందనపు బొమ్మగా ఎన్టీఆర్ భార్యను పోలుస్తున్నారు జనాలు. ప్రణతి ట్రెడిషనల్ బట్టల్లో చూడడానికి ఎంత చక్కగా అందంగా ఉంటుందో ..బన్నీ భార్య వెస్ట్రన్ వేర్ లో అంత బాగుంటుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు లక్ష్మీ ప్రణతికి వెస్ట్రెన్ సూట్ అవ్వదని ..బన్నీ భార్యకి ట్రెడిషనల్ వర్క్ అవుట్ అవ్వదని అభిప్రాయపడుతున్నారు. దీంతో బన్నీ భార్య ఎన్టీఆర్ భార్య పేర్లు వైరల్ గా మారాయి . దీనిపై అల్లు అభిమానులు నందమూరి అభిమానులు వాళ్లకి తోచిన విధంగా కామెంట్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news