Moviesఅక్క ని ఫాలో అవుతున్న చెల్లి.. మొగుడుని దూరం పెట్టేసిందా..!?

అక్క ని ఫాలో అవుతున్న చెల్లి.. మొగుడుని దూరం పెట్టేసిందా..!?

ఏంటో ఈ లోకం ప్రేమించుకున్న అన్ని రోజులు కూడా పెళ్లి బంధాన్ని నిలుపుకోలేకపోతున్నారు. ఎస్ ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో విడాకుల వార్తలు ఎక్కువగా ఉంటున్నాం . రీసెంట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఇండస్ట్రీలో మరో విడాకులు వార్త త్వరలోనే వినబోతున్నాం అంటున్నారు సినీ విశ్లేషకులు. సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి పరువు ప్రతిష్ట ఉన్నాయో.. ప్రత్యేకించి చెప్పనవసరం లేదు .

అయితే కొందరు మెగా డాటర్స్ మెగా హీరోస్ ఆ పేరుని చెడగొడుతున్నారు. ఆ లిస్టులో ముందు వరుసలో ఉంటుంది చిరంజీవి చిన్న కూతురు శ్రీజ . అమ్మడు చేసిన ఘనకార్యాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజు సోషల్ మీడియాలో న్యూస్ లు వైరల్ గా మారుతూనే ఉంటాయి. కాగా అదే లిస్టులోకి యాడ్ అయినట్టు తెలుస్తుంది మరో మెగా డాటర్ నిహారిక. ఎస్ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మెగా డాటర్ నీహారిక భర్తను దూరం పెట్టేసినట్లు తెలుస్తుంది . సిద్దు జొన్నల గడ్డను పెళ్లి చేసుకున్న నిహారిక.. పెళ్లయిన కొత్తలో భర్తను అస్సలు వదిలేది కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే చేతిలో చెయ్యి వేసుకుని..జాలీగా వెళ్లేది.

ఈ మధ్యకాలంలో మెగా డాటర్ నిహారిక భర్తతో అస్సలు టైం స్పెండ్ చేయట్లేదు. మరీ ముఖ్యంగా భర్త గురించి ప్రస్తావించట్లేదు ఏ పార్టీకి వెళ్లాలన్న.. ఏ ఫంక్షన్ కి వెళ్ళాలన్నా సింగిల్ గా వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది.. తప్పిస్తే భర్త ఎక్కడ కనిపించడం లేదు. పోనీ సిద్ధూ జొన్నలగడ్డా ఊర్లో లేరా అనుకుంటే అది కాదు,, ఇండియాలోనే ఉన్నాడు. మరి భర్తను ఎందుకు నిహారిక దూరం పెడుతుంది అంటూ మెగా అభిమానులు మండిపడుతున్నారు.

అంతేకాదు మెగా కాంపౌండ్ నుంచి అందిస్తున్న సమాచారం ప్రకారం సిద్ధు జొన్నలగడ్డకు నీహారికకు మధ్య గొడవలు జరుగుతున్నాయట . ఈ క్రమంలోనే నిహారిక అతని ని దూరం పెట్టి అమ్మ గారి ఇంట్లో ఉంటుందంట . నాగబాబు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారట . ఒకవేళ శ్రీజ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే మాత్రం మెగా ఫ్యామిలీలో మరో డివర్స్ తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు . ఏదేమైనా సరే మెగా ఫ్యామిలీ పరువు తీయడానికి కొందరు ట్రై చేస్తున్నారు అంటూ మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news