Moviesటాలీవుడ్ హిస్ట‌రీలో బాల‌య్య స‌రికొత్త చ‌రిత్ర‌... అన్‌స్టాప‌బుల్ 2తో మైండ్‌బ్లాకింగ్ రికార్డ్‌..!

టాలీవుడ్ హిస్ట‌రీలో బాల‌య్య స‌రికొత్త చ‌రిత్ర‌… అన్‌స్టాప‌బుల్ 2తో మైండ్‌బ్లాకింగ్ రికార్డ్‌..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ అనే టాక్ షో ఆహా కోసం చేస్తున్నాడ‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే దీనిపై చాలా మందికి పెద్ద‌గా అంచ‌నాలు లేవు. అప్ప‌ట‌కీ అఖండ సినిమా రిలీజ్ కాలేదు. పైగా తెలుగు బుల్లితెర‌పై ఎన్నో టాక్ షోలు వ‌చ్చాయి. స‌మంత‌, రానా లాంటి వాళ్లు హోస్ట్ చేసిన టాక్‌షోల‌కు కూడా పెద్ద‌గా పేరు రాలేదు. ఇదే ఆహాలో స‌మంత సామ్‌జామ్ చేస్తే ప్రేక్ష‌కులు ప‌ట్టించుకోలేదు.

అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 1 ఫ‌స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అయితే స్ట్రీమింగ్ అయ్యిందో అప్ప‌టి నుంచి ప్ర‌తి ఎపిసోడ్‌పై ఆస‌క్తి పెరిగిపోయింది. ప్ర‌తి ఎపిసోడ్‌ను కూడా బాల‌య్య ఒంటి చేత్తో త‌న చాక‌చ‌క్య‌మైన టాకింగ్‌తో సూప‌ర్ హిట్ చేసి ప‌డేశాడు. పూరి, సుకుమార్‌, బ‌న్నీ, చార్మీ, మోహ‌న్‌బాబు ఫ్యామిలీ, చివ‌ర్లో సూప‌ర్‌స్టార్ ఎపిసోడ్ ఇలా అన్నీ క్లిక్ అయ్యాయి. ఇక ఇప్పుడు అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 త్వ‌ర‌లోనే స్టార్ట్ అవుతోంది.

ఫ‌స్ట్ సీజ‌న్ వ‌చ్చాక బాల‌య్య క్రేజ్ వెండితెర మీద‌.. బుల్లితెర మీద‌… ఇటు సోష‌ల్ మీడియాలో అమాంతం పెరిగిపోయింది. ఇక ఇప్పుడు సీజ‌న్ 2 కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. టాలీవుడ్ హిస్ట‌రీలో ఓ ఓటీటీ కార్య‌క్ర‌మానికి ప్రి రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌బోతోంది. ఈ రికార్డ్ బాల‌య్య‌కు మాత్ర‌మే ముందుగా సొంత‌మైంది. ద‌స‌రా ముందు రోజు విజ‌య‌వాడ‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. 30 వేల మందికి పైగా వ‌స్తార‌ని అంచ‌నా వేస్తున్నారు. భారీ స‌భ‌కు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో ఈ సీజ‌న్ 2 ట్రైల‌ర్ షూట్ చేశారు. బాల‌య్య డిఫ‌రెంట్ గెట‌ప్‌లో షూటింగ్‌లో పాల్గొన్న స్టిల్స్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. సీజ‌న్ 2ను కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చేసేందుకు ఆహా ప‌గ‌డ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. సీజ‌న్ 1 కోసం ప‌నిచేసిన రైటింగ్ టీమ్‌నే రెండో సీజ‌న్‌కు కూడా తీసుకుంది. చంద్ర‌బాబు – లోకేష్‌, త్రివిక్ర‌మ్ – ప‌వ‌న్ లాంటి క్రేజీ కాంబినేష‌న్లు సెట్ చేస్తున్నారు.

అలాగే ఈ సీజ‌న్లోనే విక్ట‌రీ వెంక‌టేష్‌, చంద్ర‌బాబు లాంటి వాళ్లు కూడా రానున్నారు. చంద్ర‌బాబు, లోకేష్ వ‌స్తే తెలుగుదేశం అభిమానులు అంద‌రూ త‌ప్ప‌కుండా ఆహాను స‌బ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆహాకు పెద్ద ఆక్సిజ‌న్‌గా ఈ చాట్ షో ప‌ని చేస్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అందుకే ముందే సీజ‌న్‌కు భారీ హైప్ వ‌చ్చేందుకు విజ‌య‌వాడ‌లో ప్రి రిలీజ్ ఈవెంట్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా సీజ‌న్ 2తో కూడా బాల‌య్య మ‌రిన్ని రికార్డులు క్రియేట్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news