Moviesయంగ్ హీరో నాగ శౌర్యకి కాబోయే భార్య ఎవరో తెలిసిపోయింది.. టాప్...

యంగ్ హీరో నాగ శౌర్యకి కాబోయే భార్య ఎవరో తెలిసిపోయింది.. టాప్ సీక్రెట్ రివిల్.!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరోలలో నాగశౌర్య ఒకడు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన నాగశౌర్య ముందుగా `ఊహలు గుసగుసలాడే` సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోగా నటించి తన స్పెషాలిటీ ప్రూవ్ చేసుకున్నాడు. హీరోగా నిలదొక్కుకున్న నాగశౌర్య నటించిన `ఛ‌లో` సినిమా సూపర్ హిట్ అయింది. `ఛ‌లో` నాగశౌర్య కెరీర్ లోనే బ్లాక్ బాస్టర్ హిట్. ఈ సినిమాతోనే రష్మిక మందన్న తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం అయింది.

ఇక నాగశౌర్య తాజాగా నటించిన సినిమా `కృష్ణ వ్రిందా విహారి`. అనీష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నాగశౌర్య తల్లి ఉష మూల్పూరి నిర్మించారు. తమ సొంత బ్యాన‌ర్‌లో నిర్మించిన `ఛ‌లో` సినిమా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు `కృష్ణ వ్రిందా విహారి` సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకంతో నాగశౌర్య ఉన్నాడు.

నాగశౌర్య అభిమానులు మనోడి పెళ్లి విషయంలో ఎప్పుడెప్పుడు శుభవార్త చెబుతాడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ వస్తున్నారు. తాజా సినిమా ప్రమోషన్స్‌, ఇంటర్వ్యూలో నాగశౌర్యకు మీ పెళ్లి ఎప్పుడు ? అన్న ప్రశ్న ఎదురయింది. దీనికి నాగశౌర్య ఆన్సర్ చేస్తూ ఈ ఏడాదిలోనే నా పెళ్లి ఉండే ఛాన్స్ ఉందని.. తాను చేసుకోబోయే అమ్మాయి తెలుగమ్మాయి అని ఆ సీక్రెట్ ను రివిల్ చేసేశాడు.

నాగశౌర్య తన పెళ్లి గురించి చెప్పడంతో పాటు… కాబోయే అమ్మాయి కూడా తెలుగింటి ఆడపడుచు అని చెప్పడంతో ముందస్తు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక నాగశౌర్య చేసుకోబోయే ఆ అదృష్టవంతురాలు ఎవరు ? ఆ తెలుగమ్మాయి ఎక్కడ ఉంది అంటూ ఒక్కటే చర్చలు పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news