Moviesనిజంగా రష్మికను ఆ యంగ్ హీరో అంతగా ట్రై చేశాడా..?

నిజంగా రష్మికను ఆ యంగ్ హీరో అంతగా ట్రై చేశాడా..?

అవును తాజాగా మరోసారి రష్మిక మందన్న గురించి నెటిజన్స్ మాటలాడుకుంటున్నారు. ఛలో సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన్న. కన్నడలో హీరోయిన్‌గా మొదటి సినిమా చేసినప్పటికీ స్టార్ హీరోయిన్‌గా మాత్రం వెలుగుతుంది మాత్రం టాలీవుడ్‌లోనే. ఇక్కడ గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు సినిమాలు బాగా పాపులారిటీని తీసుకొస్తే, పాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అయింది మాత్రం పుష్ప పార్ట్ 1తోనే. అస‌లు ఇప్పుడు టాలీవుడ్‌లో ఆమె సినిమాల దెబ్బ‌తో ఆమె నేష‌న‌ల్ క్ర‌ష్మిక అయిపోయింది.

గీత గోవిందం సినిమాతో అటు రీల్ లైఫ్‌లో విజయ్‌తో లవ్ లో పడిన రష్మిక రియల్ లైఫ్‌లో కూడా అలాగే లవ్‌లో ఉందని ప్రచారం జరిగింది..ఇంకా జరుగుతోంది. ఇద్దరు కలిసి నటించిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో ముద్దులతో హోరెత్తించారు. నిజంగా ప్రేమికుల్లాగానే సిల్వర్ స్క్రీన్ మీద అలరించారు. దాంతో అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు ప్రేక్షకులలో విజయ్ రష్మికల మధ్య ఏదో ఉందని చెవులు కొరుక్కుంటున్నారు.

అయితే, కొందరు ఇండస్ట్రీలోని జనాలు..రష్మిక మందన్నను నిజంగా ప్రేమించాలని విజయ్ బాగానే ట్రై చేసినట్టుగా గుసగుసలు వినిపించాయి. మరి కారణం ఏమై ఉంటుందో గానీ, లవ్ వరకూ వెళ్ళలేదని సమాచారం. కానీ, వీలు కుదిరినప్పుడల్లా ఇద్దరు నైట్ డిన్నర్లకు, పబ్బులకు వెళుతున్నారు. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా షూటింగ్ ముంబైలో జరిగినప్పుడు రష్మికతో కలిసి విజయ్ బాగానే రెస్టారెంట్లకి తిరిగాడు.

ఇవన్నీ చూసే విజయ్ గట్టిగానే రష్మిక కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు గానీ, తను మాత్రం జస్ట్ ఫ్రెండ్ షిప్ వరకే అనేట్టుగా లిమిట్స్ పెట్టిందని టాక్ వినిపిస్తోంది. చెప్పలేము..బాలీవుడ్ కపుల్స్ కొంద‌రు అలాగే, నాగ చైతన్య – సమంత ఇలా ఉండే సడన్‌గా పెళ్లి చేసుకోబోతున్నామని షాకిచ్చారు. వీరు కూడా అలాంటి న్యూస్ చెప్పి షాకిస్తారేమో చూడాలి..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news