Moviesఆ టాలీవుడ్‌ కుర్ర హీరో సెట్‌లో హీరోయిన్ల‌కు న‌ర‌కం చూపించేస్తాడా...!

ఆ టాలీవుడ్‌ కుర్ర హీరో సెట్‌లో హీరోయిన్ల‌కు న‌ర‌కం చూపించేస్తాడా…!

మన సౌత్ సినిమా ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌లో కూడా హీరోయిన్స్‌ను తోటి నటీమణులను మానసికంగా, శారీరకంగా హింసించేవారు చాలామంది ఉన్నారు. ఇలా హింస పెట్టి ఇబ్బందులకు గురి చేసి తమ కామ కోరికలను తీరుచుకున్నవారు బయటకి తెలియకుండా చాలామందే ఉన్నారు. నాకు ఇది ఇవ్వు..నీకు అది చేస్తా..తారా స్థాయికి తీసుకొస్తా..ఇలా రివర్స్ ఆఫర్స్ ఇచ్చేవారు ఉన్నారు. కెరీర్ ప్రారంభంలో ఇవన్నీ తట్టుకుంటూనే స్టార్ స్టేటస్ వస్తుందని కాంప్రమైజ్ అయ్యేవారే ఎక్కువ శాతం ఉన్నారు.

అయితే, ఆ హింస మితి మీరితే మాత్రం మీడియా ముందుకు వచ్చి అన్నీ బట్టబయలు చేయడానికి ఎవరూ వెనకాడటం లేదు. ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది కాబట్టి సీక్రేట్‌గా కూడా ఇలా హింస పెడుతున్న వారి బాగోతాన్ని రికార్డ్ చేసి బయట పెట్టేస్తున్నారు. అయితే, ఇలా అమ్మాయిలను హింస పెట్టేవారు ప్రముఖులే కావడం ఆసక్తికరమైన విషయం అని చెప్పాలి. వీరిలో సింగర్స్, లిరిక్ రైటర్స్, సినిమాటోగ్రాఫర్స్ కూడా ఉండటం మరీ షాకింగ్ విషయం.

బాలీవుడ్‌లో ఇలాంటివన్నీ కామన్ అని మన సౌత్ ప్రేక్షకులు అనుకుంటుంటారు. కానీ, ఇలాంటివన్నీ మన తెలుగు, తమిళ భాషలలో కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది పేరు సోషల్ మీడియాలో నానుతూ ఉన్నాయి. అయితే, దర్శకుడు తేజ టాలీవుడ్‌కు ఎంతో మంది కొత్త నటీనటులను, 24 విభాగాలకు చెందిన టెక్నీషియన్స్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఓ కుర్ర హీరోను పరిచయం చేస్తున్నారు.

అయితే, ఆయన హీరోగా పరిచయం చేసిన వారిలో ఓ యంగ్ హీరో సెట్స్‌లో హీరోయిన్స్‌ను ఇబ్బంది పెడుతుంటారట. అంతేకాదు, అతను చెప్పినట్టు వినకపోతే చాలా నీచంగా అసభ్యపదాలతో దూషిస్తుంటాడని చెప్పుకుంటుంటారు. కొన్ని సినిమాలలో మాత్రమే హీరోగా నటించిన ఆ కుర్ర హీరో ఇప్పుడు ఫేడవుట్ అయ్యాడు.

సైడ్ రోల్స్ చేసుకుంటూ ఒకరకంగా చెప్పాలంటే అవి కూడా దొరకక ఇబ్బంది పడుతున్నాడు. ఇలా అవడానికి కారణం హీరోయిన్స్ పట్ల అతను ప్రవర్తించిన తీరే అని కామెంట్స్ చేస్తున్నారు. అతనెవరో తెలియాలంటే తేజ పరిచయం చేసిన హీరోలను ఒకసారి పరిశీలించవచ్చు. మీకే అర్థమవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news