Moviesతన భర్త మరో భార్య పిల్ల‌ల‌ను సొంత పిల్లాల్లా చూసుకున్న స్టార్స్...

తన భర్త మరో భార్య పిల్ల‌ల‌ను సొంత పిల్లాల్లా చూసుకున్న స్టార్స్ వైఫ్‌లు వీళ్లే…!

సినిమాల్లో నటించే వారికి, సినిమా కుటుంబాల్లో ఉండే వారికి పెద్దగా ప్రేమలు, బంధాలు ఉండవు అని అనుకుంటూ ఉంటారు. సినిమా వాళ్లంటే కలవడం, విడిపోవడం చాలా కామన్ అన్న విధంగానే ఉంటుంది ఎప్పుడు పరిస్థితి. కానీ మనం ఎవ్వరు ఊహించని విధంగా సినిమా ఇండస్ట్రీలో కూడా స్వచ్ఛమైన ప్రేమలు, బంధాలు పెన వేసుకొని కనిపిస్తాయి. ఎంతలా అంటే తమ సవతి పిల్లలకు పుట్టిన వారిని కూడా తమ సొంత పిల్లల్లాగానే చూడడమే కాదు వారు జీవితంలో ఎదగడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉండేవారు కూడా ఉన్నారు. అలా మన టాలీవుడ్ సినిమా కుటుంబాల్లో ఉన్న స్టార్స్ తమ భర్తలకు మొదటి భార్య ద్వారా కలిగిన పిల్లల పట్ల ఎంతో ప్రేమను అభిమానాన్ని చూపిస్తున్నారు వారెవరో ఇప్పుడు చూద్దాం.

విజయ నిర్మల :
హీరో కృష్ణ కి రెండవ భార్య విజయనిర్మల. అతని మొదటి భార్య ఇందిర‌ కొడుకైన మహేష్ బాబును అన్ని విషయాల్లోనూ ఎంకరేజ్ చేసేవారు విజయనిర్మల. అంతే కాదు కృష్ణ పిల్లల పెళ్లిళ్లు కూడా అన్ని దగ్గరుండి చూసుకుంది. కృష్ణ ద్వారా ఆమెకు సంతానం కలగకపోయినా కృష్ణ పిల్లలని తన పిల్లలుగా భావించింది.

 

అమల :
అక్కినేని నాగార్జునకు రెండవ భార్య అమల. నాగార్జున మొదటి భార్య లక్ష్మి కుమారుడు నాగచైతన్య. కానీ నాగచైతన్యని అన్ని విషయాల్లో కూడా అమల ఎంకరేజ్ చేస్తుంది. అంతేకాదు సినిమా ఓపెనింగ్ లకి ఆడియో ఫంక్షన్ కి వచ్చి తన అభిప్రాయాలను కూడా చెబుతుంది. తన పిల్లలు బాగుండాలని కోరుకోవడంలో అమలు ఎప్పుడూ ముందుంటుంది.

 

రాధిక శరత్ కుమార్ :
రాధిక, శరత్ కుమార్ కి రెండవ భార్య. అతని మొదటి భార్య కుమార్తె నటి వరలక్ష్మి. సినిమా ఇండస్ట్రీలో రానించడానికి వరలక్ష్మికి అన్ని విధాలా రాధిక సహాయం చేసేది. అంతేకాదు ఆమె పుట్టినరోజు ఫంక్షన్స్ కూడా రాధిక దగ్గర ఉండి చూసుకునేది. రాధిక వరలక్ష్మి జీవితంలో ప్రముఖ పాత్ర పోషించినా ఆ త‌ర్వాత ఎందుకో వీరి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది.

హరికృష్ణ ఇద్దరు భార్యలు :
హరికృష్ణ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్య లక్ష్మి ద్వారా జానకి రామ్, కళ్యాణ్ రామ్ జన్మించగా రెండవ భార్య షాలిని ద్వారా తారక్ జన్మించాడు. ఇక్కడ ఇద్దరు భార్యల గురించి గొప్పగానే చెప్పుకోవాలి. ఎందుకంటే తారక్ ని హరికృష్ణ మొదటి భార్య ఎంతగానో అభిమానిస్తుంది. అంతేకాదు కళ్యాణ్ రామ్, జానకి రామ్ లకు సైతం తారక్ తల్లి అంతే ప్రేమగా చూసుకుంటుంది. కుటుంబాలు వేరైనా, వ్యత్యాసాలు ఎంత ఉన్నా కూడా బంధాలకు కొదవలేదు అని నిరూపించారు ఈ కుటుంబం.

మంచు నిర్మల :
మంచు మోహన్ బాబు భార్య నిర్మలకు ఒకే ఒక్క కొడుకు మంచు మనోజ్. ఇక లక్ష్మీ మరియు విష్ణు ఇద్దరు కూడా మోహన్ బాబుకి మొదటి భార్య ద్వారా జన్మించారు. కాకపోతే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే మోహన్ బాబు ఇద్దరు భార్యలు కూడా సొంత అక్క, చెల్లెలు కావడం విశేషం. మొదటి భార్య చనిపోయిన తర్వాత మోహన్ బాబు తన ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి ఆమె చెల్లెలు నిర్మలను పెళ్లి చేసుకున్నాడు. ఇక మనోజ్ కంటే ఎక్కువ కూడా లక్ష్మీ, విష్ణుని ఇష్టపడుతుంది నిర్మల.

గౌతమి :
కమల్ హాసన్ తో గౌతమి పదేళ్లపాటు సహజీవనం చేసింది.కమల్ కి సారిక ద్వారా అప్పటికే శృతిహాసన్ సారిక హాసన్ జన్మించగా వారిద్దరు విడాకులు తీసుకోవడంతో పిల్లలు ఇద్దరు కమల్ హాసన్ తోనే పెరిగారు. గౌతమి సైతం శృతి, సారికలను ఎంతగానో ఎంకరేజ్ చేసేది. వారికి తల్లి నోటు తీర్చడంలో గౌతమి ఏమాత్రం వెనకాడ లేదు. శృతికి సంబంధించిన అన్ని సినిమా కార్యక్రమాలు గౌతమి దగ్గరుండి చూసుకునేది. అయితే చివ‌ర్లో శృతి వ‌ల్లే గౌత‌మి – క‌మ‌ల్ బంధానికి బ్రేక్ ప‌డింద‌ని అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news