Movies"దద్దమ్మ" అంటూ నితిన్ ని దారుణంగా అవమానించిన స్టార్ డైరెక్టర్..ఎంత కోపం...

“దద్దమ్మ” అంటూ నితిన్ ని దారుణంగా అవమానించిన స్టార్ డైరెక్టర్..ఎంత కోపం అంటే..!?

మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలోకి హీరో, హీరోయిన్ గా రావడం ఒక ఎత్తు అయితే.. అలా వచ్చి టాలెంట్ తో మెప్పించి జనాలను అభిమానులను సొంతం చేసుకోవడం మహా కష్టం . అలా తాను కష్టపడుతూ జనాలని మెప్పించిన హీరోనే ఈ నితిన్ . జయం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటర్ అయిన నితిన్.. కెరియర్ లోనే ఫస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికీ జయం సినిమా టీవీలో వస్తే టీవీకి అతుక్కుపోయి చూసే జనాలు ఎంతోమంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేమని హైలెట్ చేస్తూ హీరో హీరోయిన్లు అమాయకత్వాన్ని చూసుకొని తల్లిదండ్రులు నడిపిన కుట్రని బయటపెట్టిన కధే జయం.

ఈ సినిమాలో నితిన్ నటన ఎప్పటికీ మర్చిపోలేం. ఇప్పటికీ ఈ సినిమా చూసి ఆశ్చర్యపోతూనే ఉంటారట నితిన్. కాగా ఈ సినిమాను డైరెక్ట్ చేసింది తేజ. మనకు తెలిసిందే డైరెక్టర్ తేజ కి కోపం ఎక్కువ. తాను చెప్పిన సీన్ ఎగ్జాక్టుగా చేయకపోతే హీరోయిన్లు చెయ్యెత్తి కొట్టే స్థాయికి కూడా వెళ్ళిపోతాడు స్టార్ డైరెక్టర్ తేజ అనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంది. కాగా జయం సినిమా షూటింగ్ టైంలో నితిన్ పై నోరు పారేసుకున్నాడట డైరెక్టర్ తేజ.

సినిమాలో సదాని కలవడానికి గుడి దగ్గరకు వస్తారు హీరో. ఆ టైంలో విలన్ గోపీచంద్ హీరోని చితక్కొడతాడు. అంతేకాదు సదాని నాలుకతో నాకేస్తాడు. అప్పుడు డైరెక్టర్ తేజ చెప్పిన ఎక్స్ప్రెషన్ ” మన అనుకున్నా అమ్మాయిని పరాయి మగాడు టచ్ చేస్తే ఎలా బాధపడతామో ..ఆ బాధ కళ్ళల్లో కనిపించాలి “అంటూ చెప్పుకొచ్చారట .

కానీ నితిన్ కి అదే మొదటి సినిమా కావడంతో డైరెక్టర్ తేజ చెప్పిన ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి చాలా టేకులు పట్టాయట . ఈ క్రమంలోనే టేకుల మీద టేకులు తీసుకుంటున్న నితిన్ ని..ఒక్కసారిగా దద్దమ్మ నీకు ఆ పని కూడా చేతకాదా అంటూ అరిచారట. దీంతో ఒక్కసారిగా సదా గోపిచంద్ అక్కడున్న టీం అంత షాక్ అయ్యారట. ఫైనల్ గా డైరెక్టర్ తేజ అనుకున్న ఎక్స్ ప్రేషన్ సాధించాడట నితిన్. ఇప్పటికీ టీవీలో ఆ సీన్ చూస్తున్నప్పుడు నితిన్ ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంటాడట. ప్రజెంట్ నితిన్ కెరియర్ వరుస డిజాస్టర్లతో దారుణాతి దారుణమైన పొజిషన్లో ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news