Moviesఎన్టీఆర్ వెంట ప‌డుతోన్న ప్ర‌భాస్ హీరోయిన్‌... అబ్బో పెద్ద ప్లానే వేసిందిగా...!

ఎన్టీఆర్ వెంట ప‌డుతోన్న ప్ర‌భాస్ హీరోయిన్‌… అబ్బో పెద్ద ప్లానే వేసిందిగా…!

రోజులు గడుస్తున్నాయి.. నెలలు అయిపోతున్నాయి.. అయినా కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులను బాగా నిరుత్సాహపరుస్తూనే ఉన్నాడు. `త్రిబుల్ ఆర్` లాంటి పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా తర్వాత ఎన్టీఆర్ వెంటనే కొరటాల శివ సినిమా మొదలుపెట్టేస్తాడని.. ఈ యేడాదిలోనే ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా రిలీజ్ అవుతుందని… ఎన్టీఆర్ అభిమానులు ఎన్నో ఆశలతో ఉన్నారు. 2018 లో వచ్చిన `అరవింద సమేత వీర రాఘవ` తర్వాత మళ్లీ ఎన్టీఆర్ సినిమా థియేటర్లలో చూసేందుకు ఏకంగా నాలుగు సంవత్సరాలు పట్టింది.

` త్రిబుల్ ఆర్` తర్వాత ఎన్టీఆర్ తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వరుసగా సినిమాలు చేసి తమను అల‌రిస్తాడని ఎన్టీఆర్ అభిమానులు అనుకున్నారు. ` త్రిబుల్ ఆర్` రిలీజ్ అయ్యి ఇప్పటికే ఆరు నెలలు దాటిపోతుంది. అయినా ఎన్టీఆర్ కొత్త సినిమా ఇంకా పట్టాలు ఎక్కలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కొరటాల శివ డైరెక్ట్ చేసిన `ఆచార్య` సినిమా డిజాస్టర్ అయింది. దీంతో కొరటాల ఎన్టీఆర్ తో ఎలాంటి కథతో సినిమా తీయాలన్న‌ డైల‌మాలో పడిపోయారు.

ముందుగా అనుకున్న కథను మార్పులు చేర్పులు చేస్తున్నారు. దీనికి తోడు ఈ క్రేజీ ప్రాజెక్టు పాన్ ఇండియా సినిమాగా వస్తుండడంతో హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై కొరటాలకు ఇంకా క్లారిటీ రాలేదు. పైగా `ఆచార్య` లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా ఉండడంతో కొరటాల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కూడా తేడా కొడితే కొరటాల పేరు పాతాళంలోకి వెళ్లిపోతుంది. అప్పుడు కొరటాలను పట్టించుకునే వారే ఉండరు. అందుకే కొరటాల ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.

`త్రిబుల్ ఆర్` తర్వాత ఎన్టీఆర్ కు సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ లోను మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీనికి తోడు కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారాలని ప్లానింగ్ తో ఉన్నాడు. అందుకే కథతో పాటు హీరోయిన్ విషయంలో బాగా త‌ర్జ‌నభర్జ‌నలు పడుతున్నట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా `సాహో` సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ శ్రద్ధా కపూర్ పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కొరటాల శివ టీం శ్రద్ధ కపూర్‌ను మీట్ అయినట్టు తెలుస్తుంది. అటు శ్రద్ధా కపూర్ కూడా తన చేతిలో రణవీర్ సింగ్ సినిమా `లవ్ రంజాన్` మినహా ఏ సినిమా లేకపోవడంతో ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో ఆన్ స్క్రీన్ రొమన్స్ కు శ్రద్ధ తన వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తెలుస్తోంది.

వాస్తవంగా చూస్తే ఈ సినిమాలో ముందుగా ఎన్టీఆర్ కి జోడిగా మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ పేరు పరిశీలించారు. అయితే ఆమె పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్ అవడంతో ఎన్టీఆర్ సినిమాను అయిష్టంగానే వదులుకుంది. ఇప్పుడు అన్ని సెట్ అయితే ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేసే ఆ లక్కీ ఛాన్స్ శ్రద్ధా కపూర్ కు దక్కినట్టే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news