Moviesఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో బాల‌య్య సినిమా... నిర్మాత ఎవ‌రంటే...!

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో బాల‌య్య సినిమా… నిర్మాత ఎవ‌రంటే…!

నందమూరి బాలకృష్ణ `అఖండ` సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య రవితేజతో `క్రాక్` లాంటి ఊర మాస్ హిట్ సినిమా తెరకెక్కించిన మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `అఖండ` బాలయ్య కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఉత్సాహంతో బాలయ్య వరుసగా క్రేజీ ప్రాజెక్టులను సెట్ చేసుకుంటూ వెళుతున్నాడు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్‌తో పాటు.. కోలీవుడ్ క్రేజీ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న‌ ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత బాలయ్య 108వ ప్రాజెక్ట్ కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనుంది. సాహు గార‌పాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌ను లైన్లో పెడుతూ దూసుకుపోతున్న బాలయ్య అనిల్ రావిపూడి సినిమా తర్వాత కూడా రెండు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది.
పూరి జగన్నాథ్ బాలయ్య కోసం అదిరిపోయే కథ రెడీ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య డబుల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తండ్రీ, కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ గా ఈ సినిమా కథ ఉంటుందని అంటున్నారు.

అలాగే బోయపాటితో మరో సినిమా చేసే ప్లానింగ్ లో కూడా బాలయ్య ఉన్నాడు. ఈ క్రమంలోనే మరో దర్శకుడు పేరు కూడా బాలయ్య లైన్లో వినిపిస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు కెఎస్ రవీంద్ర ( బాబి). ఎన్టీఆర్ తో `జై లవకుశ` లాంటి హిట్ సినిమా తెరకెక్కించిన బాబి మాస్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బాబి మెగాస్టార్ చిరంజీవితో `వాల్తేరు వీరయ్య` సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సినిమా పూర్తైన‌ వెంటనే బాబి.. బాలయ్యతో తెరకెక్కించే సినిమా కథపై కసరత్తులు చేస్తాడని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో బాలయ్య ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు బాబి చేసే సినిమా ఆ బ్యానర్ లోనే రూపొందుతుందని తెలుస్తోంది. ఇక బాబీ సైతం కథ మెయిన్ లైను బాలయ్యకు చెప్పాడని.. పూర్తి కథ డెవలప్ చేసి త్వరలోనే వినిపిస్తాడని తెలుస్తోంది. ఏదేమైనా బాబి లాంటి మాస్ డైరెక్టర్ బాలయ్య కాంబోలో సినిమా అనగానే సహజంగానే అంచనాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news