Moviesక‌ళ్యాణ్‌రామ్ హీరోయిన్‌తో మెగాస్టార్ ఫిక్స్‌... చివ‌ర్లో షాక్ ఇచ్చారుగా...!

క‌ళ్యాణ్‌రామ్ హీరోయిన్‌తో మెగాస్టార్ ఫిక్స్‌… చివ‌ర్లో షాక్ ఇచ్చారుగా…!

`ఆచార్య` తర్వాత మెగాస్టార్ చిరంజీవి `లూసిఫర్` రీమేక్ `గాడ్ ఫాదర్`తో దసరా కనుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదేరోజు మరో సీనియర్ హీరో నాగార్జున నటిస్తున్న `ది ఘోస్ట్` కూడా `గాడ్ ఫాదర్` కు పోటీగా రిలీజ్ అవుతుంది. మలయాళం లో హిట్ అయిన లూసీఫర్‌ను తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు.. మెగా ఫ్యాన్స్ కోసం చాలా మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. మోహనరాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార కూడా కీలక పాత్రలో నటిస్తోంది.

ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సత్య‌దేవ్ ఓ నెగటివ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌… మెగాస్టార్ మధ్య ఓ పాట కూడా షూట్ చేశారు. అయితే అది సినిమాలో సెట్ కాకపోవడంతో రోలింగ్ టైటిల్స్ మీదకు మార్చేశారు. సినిమా అంతా అయిపోయాక రోలింగ్ టైటిల్స్ లో సల్మాన్, చిరంజీవి మధ్య స్పెషల్ సాంగ్ ఉన్నా సినిమాకు హెల్ఫ్‌ అవ్వదని మేకర్స్ డిసైడ్ అయ్యారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు సినిమా మధ్యలో మాస్ ప్రేక్షకుల కోసం ఓ మసాలా సాంగ్ ప్లాన్ చేశారు. ఈ స్పెషల్ సాంగ్ అప్పటికప్పుడు అనుకుని చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం అదిరిపోయే హీరోయిన్ ను రంగంలోకి దించారు. రీసెంట్‌గా కళ్యాణ్ రామ్ `బింబిసార` సినిమాలో కళ్యాణ్ రామ్ ని కవ్విస్తూ ఆడి పాడిన వ‌రీనాఆ హుస్సేన్ ను రప్పించి మరి ఈ ఐటెం సాంగ్ షూట్ చేశారు. ఈ ఐటెం సాంగ్ అనుకోకుండా చివ‌ర్లో వ‌చ్చిన ట్విస్టే..!

ఈ ఐటెం సాంగ్ ఒక్కదానికే ఏకంగా కోటిన్నర ఖర్చయినట్టు సమాచారం. వ‌రీనా – చిరు క‌లిసి స్టెప్పులు వేస్తే ర‌చ్చే. మరి ఈ స్పెషల్ సాంగ్ సినిమాకు ఎంత ప్లస్ అవుతుంది. లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాద‌ర్‌తో చిరంజీవి తెలుగులోనూ మ్యాజిక్ చేస్తారా? లేదా ? అన్నది అక్టోబర్ 5న తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news