Moviesమీరు అనుకున్నట్లు నా భార్య అమాయకురాలు కాదు..కృష్ణ వంశీ నోటి దూకుడుతో...

మీరు అనుకున్నట్లు నా భార్య అమాయకురాలు కాదు..కృష్ణ వంశీ నోటి దూకుడుతో రమ్య పరువు పాయే..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్ తో.. తన కమిట్మెంట్ తో.. తన నిజాయితీతో సినిమాలు తీస్తూ ..ఇప్పటికి జనాలను మెప్పిస్తున్నాడు . అఫ్ కోర్స్ ఒకప్పటి అంత హిట్స్ కొట్టకపోయినా.. కృష్ణవంశీ తనదైన మార్కును సినిమాలో చూపిస్తూనే ఉన్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేం కానీ ఖచ్చితంగా జనాలని మెప్పిస్తుంది ..ఆలోచింపచేస్తుంది అని చెప్పాలి . కగా మరి కొద్ది రోజుల్లో రంగమార్తాండ అనే సినిమాతో జనాల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య రమ్యకృష్ణ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.

మనకు తెలిసిందే డైరెక్టర్ కృష్ణవంశీ హీరోయిన్ రమ్యకృష్ణని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన చంద్రలేఖ సినిమా టైంలో రమ్యకృష్ణ కృష్ణవంశీ ప్రేమించుకున్నారు . ఆ తర్వాత కొన్నాళ్ళకి పెళ్లి చేసుకున్నారు . అయితే నిజానికి కృష్ణవంశీ లైఫ్ లో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నారట. ఎందుకంటే తను లైఫ్ లో బందీగా ఉండడం ఇష్టం లేదట ..రెస్పాన్సిబిలిటీ , బాధ్యతలు తనకి పట్టించుకునే ఓపిక ఉండదని ..అందుకే ఈ కారణంగా పెళ్లికి దూరంగా ఉండాలనుకున్నారట . కాని రమ్యకృష్ణను చూశాక అన్ని మటుమాయమైపోయాయట . అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయారట . ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్తే సరదాగా నవ్వించాడు కృష్ణవంశీ.


కాగా గత కొంతకాలంగా వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ పై స్పందిస్తూ..” అలాంటివేవీ లేవు.. నేను రమ్య చాలా హ్యాపీగా ఉన్నాం. శ్రీ ఆంజనేయం సినిమా టైంలో మా మధ్య విభేదాలు వచ్చాయని కొందరు అంటున్నారు. కానీ అవి ఏమి కావు ఆ సినిమాలో రమ్యకృష్ణ పెట్టుబడులు పెట్టలేదు . మీరు అనుకున్నట్టు రమ్యకృష్ణ అంత అమాయకురాలు కాదు. చాలా తెలివితేటలు ఉన్నాయి ..మంచి ఆలోచనలు చేస్తూ సంసారాన్ని ముందుకు నెట్టుకొస్తుంది . ఇక నా కొడుకు సినిమాలోకి వస్తాడో లేదో నాకు తెలియదు . అది పూర్తిగా వాడి ఇష్టం.. వాడు వస్తానంటే నేను వద్దను ..రాను అంటే బలవంతం చేయను” అంటూ చెప్పుకొచ్చారు. కాగా కృష్ణవంశీ రమ్యకృష్ణ పై చేసిన కామెంట్స్ పరోక్షంగా ఆమెను విమర్శించే విధంగా ఉన్నాయని అంటున్నారు కొందరు నెటిజన్స్ . కృష్ణవంశీ కావాలనే రమ్యని బ్యాట్ చేస్తున్నారని ..ఆమె అంత అమాయకురాలు కాదు అనే పదం వాడడం రమ్య అభిమానులను హర్ట్ చేసింది. దీంతో ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news