Moviesబాలీవుడ్ హీరోయిన్ల‌ను మించిన అందం కేజీయ‌ఫ్ య‌శ్ భార్య రాధిక సొంతం......

బాలీవుడ్ హీరోయిన్ల‌ను మించిన అందం కేజీయ‌ఫ్ య‌శ్ భార్య రాధిక సొంతం… ఆమె ఎవ‌రో తెలుసా…!

కేజీయ‌ఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో య‌శ్ నేష‌న‌ల్ రాకింగ్ స్టార్ అయిపోయాడు. కేజీయ‌ఫ్ ఆ త‌ర్వాత దీనికి సీక్వెల్‌గా వ‌చ్చిన కేజీయ‌ఫ్ 2 అయితే తిరుగులేని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు య‌శ్ అంటే నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు. య‌శ్ ఒక్క సినిమాతోనే ఇంత పెద్ద స్టార్ అయిపోయినా కూడా చాలా సింపుల్‌గా ఉంటాడు. య‌శ్ అస‌లు పేరు న‌వీన్‌కుమార్ గౌడ్‌. ఇక య‌శ్ భార్య రాధికా పండిట్ కూడా ఓ హీరోయిన్నే అన్న సంగ‌తి తెలిసిందే.

రాధిక న‌టించిన ‘మోగ్గినా మనసు’ చిత్రంతో కన్నడ సినీ రంగ ప్రవేశం చేశాడు యష్. ఆ సినిమా టైంలోనే వీరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కొన్నాళ్ల పాటు డేటింగ్ కూడా చేశారు. త‌ర్వాత 2016లో వీరి పెళ్లి జ‌రిగింది. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు. ఓ కుమార్తె ఐరాతో పాటు కుమారుడు య‌త‌ర్వ్ కూడా ఉన్నాడు. య‌శ్‌తో పెళ్ల‌య్యాక రాధికా పండిట్ సినిమాల‌కు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్‌లో బిజీ అయిపోయింది.

హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న‌ప్పుడే రాధిక య‌శ్‌ను పెళ్లి చేసుకుంది. ఇక రాధిక‌ను ఈ వ‌య‌స్సులో ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయ్యాక కూడా చూస్తే బాలీవుడ్ హీరోయిన్ల‌ను మించిన అందంతో ఉంటుంది. విచిత్రం ఏంటంటే య‌శ్‌కు ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో అత‌డి భార్యగా రాధిక‌కు కూడా అంతే క్రేజ్ వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో అయితే త‌న భ‌ర్త‌తో స‌మానంగా ఆమెకు ఫాలోవ‌ర్లు ఉన్నారు.

ఆమె ఫొటోల‌కు ల‌క్ష‌ల్లో లైకులు, కామెంట్లు ప‌డుతూ ఉంటాయి. తాజాగా సైమా అవార్డుల ప్ర‌ధానోత్స‌వంలో ఆమె త‌ళుక్కుమంది. భ‌ర్త య‌శ్‌తో క‌లిసి ఆమె న‌డిచి వ‌స్తుంటే ఆమెను చూస్తోన్న వారందూ ఆమె ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అంటే ఎవ్వ‌రూ న‌మ్మేలా లేరు. అంత అందంతో ఉంది. సైమా ఫంక్ష‌న్లో య‌శ్‌, రాధిక కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. వీటిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news