Moviesఎన్టీఆర్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమా చేయ‌డానికి ఇంత చ‌రిత్ర ఉందా...!

ఎన్టీఆర్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర సినిమా చేయ‌డానికి ఇంత చ‌రిత్ర ఉందా…!

సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌న కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించారు. జాన‌ప‌దం, సాంఘీకం, పౌరాణికం, చారిత్ర‌కం ఇలా ఏ పాత్ర‌లో అయినా ఇట్టే ఒదిగిపోగ‌ల హీరో ఎన్టీఆర్ ఒక్క‌రే. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌మైన గొప్ప సినిమాలే వ‌చ్చాయి. అందులో శ్రీ మ‌ద్విరాట్ పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర‌స్వామి చరిత్ర ఒక‌టి. ఎన్టీఆర్ ఈ సినిమా చేయ‌డం వెన‌క చాలా చరిత్రే ఉంది.

 

 

ఎన్టీఆర్ ఓ సారి కడప జిల్లా సిద్ధవటంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆశ్రమానికి వెళ్లారు. అప్పుడు తెర‌మీద బొమ్మ‌లు ఏదో ఒక రోజు అధికారంలోకి వ‌స్తాయ‌ని బ్ర‌హ్మం గారు త‌న కాల‌జ్ఞానంలో చెప్పిన విష‌యం ఎన్టీఆర్‌ను బాగా ఆక‌ర్షించింది. దేవుడు అంటే బ‌హుళా ఇలాగే ఉంటాడేమో అని ఎన్టీఆర్ బ్ర‌హ్మం గారి పాత్ర‌లో జీవించేశారు. బ్ర‌హ్మం గారు జీవించి ఉండ‌గా వేసుకున్న చెప్పులు అచ్చు గుద్దిన‌ట్టు త‌న‌కు స‌రిపోవ‌డం ఎన్టీఆర్‌ను చాలా ఆశ్చ‌ర్య ప‌రిచింది.

 

దీంతో ఎన్టీఆర్‌కు ఈ సినిమా చేయాల‌న్న కోరిక క‌లిగింది. పైగా ఆ సినిమాలో తాను ఎంతో గౌర‌వించే ఎంజి. రామ‌చంద్ర‌న్‌ను చూపించారు. అయితే ఎన్టీఆర్ కూడా నిజంగానే సీఎం అవుతార‌ని కొంద‌రు అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రి ఇందిరాగాంధీ చెవిలో వేయ‌డంతో మ‌ద్రాస్ సెన్సార్ బోర్డు ఈ సినిమాకు అభ్యంత‌రం చెపుతూ సెన్సార్ క్లియ‌రెన్స్ ఇవ్వ‌లేదు.

ఈ సినిమా షూటింగ్ 1980లో ప్రారంభ‌మై 1981లో పూర్త‌య్యింది. అయితే సెన్సార్ అభ్యంత‌రాల త‌ర్వాత ఎన్టీఆర్ మూడేళ్ల పాటు న్యాయ‌పోరాటం చేశారు. చివ‌ర‌కు 1984 నవంబ‌ర్ 29న రిలీజ్ అయిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. విచిత్రం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకు ఎన్టీఆర్ నిజంగానే సీఎంగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news